ఆ ఊర్లో పెళ్లైన కొన్ని రోజులకే చనిపోతున్న మగవాళ్లు.. అసలు కారణం ఇదే!

by Dishafeatures2 |
ఆ ఊర్లో పెళ్లైన కొన్ని రోజులకే చనిపోతున్న మగవాళ్లు.. అసలు కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : అదో చిన్న పల్లెటూరు. ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటిలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులందరూ ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. కొందరు మహిళలు గుండెలవిసేలా ఏడుస్తున్న ఓ యువతిని ఓదారుస్తున్నారు. అక్కడికి కొద్ది దూరంలో పలువురు పురుషులు ఏదో హడావిడిగా ఉన్నారు. మరి కొందరు ఏవో ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి చూస్తే ఏదో జరగాని ఘోరం జరిగిందన్న అనుమానవం కలిగింది నీరజకి. ఇంకేముందు అక్కడికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేసిన ఆమెకి అసలు విషయం తెలిసి, ఆశ్చర్యంతోపాటు చాలా బాధ కలిగింది. ఎందుకంటే అక్కడ పెళ్లైన రెండు నెలలకే తన భర్తను కోల్పోయిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు ఏడుస్తుండటం చూసిన నీరజలో సహజంగానే బాధ కలిగింది. ఇది నీరజకు మాత్రమే ఎదురైన సంఘటన కాదు, ఆ గ్రామాన్ని సందర్శించిన ఏ వ్యక్తి అయినా అసలు విషయం తెలిసి ఇలాగే బాధపడుతూ వెనుదిరుగుతారట. ఇంతకీ అది ఏ గ్రామం? ఏం జరిగింది? అనే కదా మీ సందేహం?.. రాజస్థాన్‌ రాష్ట్రంలోని, బుండి జిల్లాలో గల బుధాపురా గ్రామం.

బుధాపురా గ్రామంలో ఎక్కడ చూసినా చిన్న వయస్సులోనే భర్త చనిపోయిన స్త్రీలే (వితంతువులు) కనిపిస్తుంటారనే వార్తలు తరచూ వైరల్ అవుతున్నాయి. దీంతో కొందరు ఆ గ్రామానికి ఏదో శాపం ఉందనే మూఢ నమ్మకాన్ని కూడా నమ్ముతుంటారు. కానీ వాస్తవం మరోలా ఉందని, పరిశోధనల్లో తేలిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏంటంటే.. ఈ గ్రామంలోని మగవాళ్లు త్వరగా చనిపోవడానికి అసలు కారణం సిలికోసిస్ వ్యాధి. ఇదొక వృత్తి సంబంధిత శ్వాసకోశ వ్యాధి. స్ఫుటికాకార సిలికా ధూళి లంగ్స్‌లోకి ప్రవేశించడంతో రెండు మూడు రోజుల్లోనే ఆయాసం, జ్వరం, న్యుమోనియా, వ్యక్తి నీలిరంగులోకి మారడం, శారీరక బలహీనత వంటివి సంభవిస్తాయి. దీంతో ఊపిరితిత్తులు పనిచేయడం ఆగిపోగానే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది.

సిలికోసిస్ వ్యాధి కారణంగానే బుధాపురాలో ఎక్కవమంది మగవాళ్లు చిన్న వయస్సులో చనిపోతున్నారని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే ఇక్కడి మగవారిలో అత్యధికమంది సమీపంలోని రాతి గనుల్లోనే పరిచేస్తారు. రాళ్లను పగలగొట్టడానికి గంటల తరబడి కష్టపడతారు. ఈ సందర్భంగా రాక్ డస్ట్‌ను, అలాగే దానిని శుద్ధి చేసే కర్మాగారపు విషపూరితాలను పీల్చడం, వైద్య సదుపాయాలు సక్రమంగా లేకపోవడం కారణంగా చాలామంది పురుషులు చిన్న వయస్సులో చనిపోతుంటారని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. అందులోని ఏ అంశాన్నీ మేము ధృవీకరించడం లేదు.

Next Story