సెక్స్ ఎడ్యుకేషన్‌తోనే భద్రత!! ప్రజల్లో అపోహలను తొలగించే ప్రయత్నం

by Hamsa |
సెక్స్ ఎడ్యుకేషన్‌తోనే భద్రత!! ప్రజల్లో అపోహలను తొలగించే ప్రయత్నం
X

దిశ, ఫీచర్స్ : సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలను భ్రష్టుపట్టిస్తుందని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వాస్తవాలు మరో రకంగా ఉన్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ అమలవుతున్న దేశాల్లోని గణాంకాలు ఈ ఆలోచన తప్పు అని రుజువు చేస్తున్నాయి. లైంగిక విద్య అపరాధం కాదని.. పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు ఇదొక మార్గమని చెప్తున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశానికి చెందిన ప్రముఖ లైంగిక విద్యావేత్త అంజు కిష్.. 'Untaboo' అనే సంస్థను స్థాపించి లైంగిక విద్యపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది తల్లిదండ్రుల బాధ్యత అని, అవసరం లేదని పక్కనపెడితే పిల్లలు చెడుమార్గంలో వెళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సెక్స్ ఎడ్యుకేషన్ అనేది శృంగారం గురించి కాదు. చాలా సానుకూల, బాధ్యతాయుతమైన దృక్పథంతో పిల్లలు చిన్నతనం నుంచి యుక్తవయస్సు వరకు సాఫీగా మారడానికి సహాయం చేయడమని అంటున్నారు అంజు కిష్. తమ పిల్లలు అమాయకులని, ఈ విషయాలు వారికి తెలియదని అనుకోవడం కరెక్ట్ కాదంటున్న ఆమె.. 'F**' అనే ఆంగ్లంలోని అక్షరాలు పిల్లలు వాడటం మీరు గమనించట్లేదా? జీ స్పాట్ అంటే ఏంటని ప్రశ్నించడం చూడట్లేదా? టీవీ, హోర్డింగ్స్, పేపర్స్‌లో కండోమ్స్ ప్రకటనలు చూస్తున్నప్పుడు వారికి డౌట్ రాదంటారా? ప్రసార మాధ్యమాల్లో, సినిమాల్లో రేపు సీన్లు చూశాక వారి బ్రెయిన్‌లో ఏం తిరగదంటారా? అని ప్రశ్నిస్తున్నారు అంజు.

ప్రస్తుతం సోషల్ మీడియాను చిన్నపిల్లలు కూడా విరివిగా యూజ్ చేస్తున్నారని.. ఈ క్రమంలో పోర్నోగ్రఫీకి అడిక్ట్ అవుతున్నారని వార్న్ చేస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. పిల్లలు చెడుగా ఆలోచించక ముందే.. వారి ఏజ్‌ను బట్టి అర్థమయ్యేలా ఇంటిమేట్ మ్యాటర్స్ గురించి వివరించాలని సూచిస్తున్నారు. కండోమ్, శానిటరీ ప్యాడ్, గే, F**, తల్లి కడుపులోకి శిశువు ఎలా వస్తుంది? అనే విషయాలను సరైన మార్గంలో వివరించే ప్రయత్నం చేయాలి అంటున్నారు. పొట్టలో ఒక చిన్న విత్తనం ఉంటుంది.

సమయం వచ్చినప్పుడు తల్లి విత్తనం శాస్త్రీయ ప్రక్రియ ద్వారా తండ్రి విత్తనంతో కలిసిపోతుంది. ఆ విత్తనం మొక్కగా పెరుగుతుందంటూ పిల్లలకు అర్థం చేయించాలి. వయసు పెరిగే కొద్ది తగిన సమాచారం ఇవ్వాలి. అందుకే మనం సెక్స్ ఎడ్యుకేషన్ అనే పదానికి మరొక పర్యాయపదాన్ని కనుక్కోవాలి అంటున్నారు అంజు. సెక్స్ ఎడ్యుకేషన్ అనగానే ప్రజల్లో వికృత, వింత ఆలోచనలు వస్తాయని.. అలాంటి థింకింగ్ మారాల్సిన అవసరం ఉందన్నారు. 'బాడీ లిటరసీ', 'అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం' వంటి కొన్ని పదాలు వాడుతున్నప్పటికీ.. ఇంకా మంచి పదాలు కావాలన్నారు.

ప్రజలను భయపెట్టకుండా ధీమాగా ఉంచగలిగే పదాలను ప్రవేశపెట్టాలని.. సంభాషణా చాతుర్యంతో ఒక స్నేహితుడిగా పిల్లల వింత ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలన్నారు. 'అమ్మాయిలకు బూబ్స్ ఎందుకు ఉన్నాయి?', 'పెద్దలు పెదవులపై ఎందుకు ముద్దు పెట్టుకుంటారు?', 'పెద్దలు తమ తల్లి పాలు ఎందుకు తాగరు?'; 'స్మూచింగ్ అంటే ఏమిటి?', 'ఫక్ అంటే ఏమిటి?', 'వర్జినిటీ అంటే ఏమిటి?' అనే విషయాలను కచ్చితంగా పిల్లలకు తెలపాలని అప్పుడే వారికి బ్యాడ్ అండ్ గుడ్ టచ్‌ మధ్య తేడా తెలుస్తుందని, సురక్షితంగా ఉంటారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed