నవ్వకపోతే నేరం.. చెట్లెక్కితే జరిమానా.. ఈ వింత ఆచారాలు ఎక్కడంటే..

by Javid Pasha |
నవ్వకపోతే నేరం.. చెట్లెక్కితే జరిమానా.. ఈ వింత ఆచారాలు ఎక్కడంటే..
X

దిశ, ఫీచర్స్ : నవ్వు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అట్లని పగలబడి నవ్వండని మనల్ని ఎవరూ బలవంతం చేయరు. నవ్వడం, నవ్వకపోవడం మన ఇష్టా యిష్టాలను బట్టి ఉంటుంది. కానీ ఇటలీలోని మిలన్, మరి కొన్ని ప్రాంతాల్లో అలా కాదు. ఇక్కడ ‘హ్యాపీ లా’ అనే ఒక చట్టం వర్తిస్తుంది. ఆస్ట్రో హంగేరియన్లు పరిపాలించే సమయంలో మిలనీస్ ప్రజలు స్మైల్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో 19వ శతాబ్దంలో దీనిని తీసుకొచ్చారట. ‘పబ్లిక్ డెకోరమ్‌’ను, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బందులను నిరోధించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ చట్టం ఇప్పటికీ రద్దు చేయబడలేదు. కానీ దాని అమలు గురించి కూడా ఎవరూ పట్టించుకోరు. అయితే నవ్వకపోతే నేరం అనే మాటలు సరదాకోసం చాలామంది ఉపయోగిస్తుంటారు.

బాధపడితే జరిమానా..

ఇటాలియన్ శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 660 ప్రకారం.. ఎవరైనా బహిరంగ ప్రదేశంలో ఉద్దేశ పూర్వకంగా గానీ, సరైన కారణం లేకుండా గానీ దుక్కించడం, పెద్దగా రోధించడం, ఇతరులు భావోద్వేగాలకు గురయ్యేలా వ్యవహరించడం కూడా నేరం. దీనికిగాను సదరు వ్యక్తికి 50 యూరోలకు మించకుండా జరిమానా విధించవచ్చు. ఈ చట్టం నేటికీ ఉంది కానీ.. గతానికి సంబంధించిన అవశేషంగా పరిగణించబడుతుంది. కాబట్టి అమలు గురించి పట్టించుకోరు.

చెట్లు ఎక్కడం నిషేధం

చెట్లు ఎక్కి ఆడుకోవడాన్ని అందరూ సరదాగా పరిగణిస్తారు. కానీ కెనడాలోని ఒషావా సిటీలో అలా కాదు. ఇక్కడ చెట్లు ఎక్కడం నిషేధం. తెలిసి చేసినా, తెలియక చేసినా జరిమానా విధిస్తారు. చెట్లను సంరక్షించే ఉద్దేశంతో ఒషావా మున్సిపాలిటీ పరిధిలో 2008లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. నగర పరిధిలోని చెట్లపై ఎక్కడమే కాదు, ఏవైనా వస్తువులను చెట్లకు తగిలించడం కూడా నేరం.



Next Story