- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Trending పెళ్లి చేసుకోవడానికి వరుడు కావలెను.. యువతి షాకింగ్ కండిషన్స్ చూస్తే ఖంగు తినాల్సిందే!
దిశ, ఫీచర్స్ : పెళ్లి చేసుకోవాలకునే వ్యక్తి ఎవరైనా ఏం ఆలోచిస్తారు?.. తాను చేసుకోబోయే అబ్బాయి/అమ్మాయి మంచి వ్యక్తి అయి ఉండాలని, జీవితంలో సంతోషంగా బతికేందుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఇంకొందరు సొంత ఇల్లు, పొలం వంటి స్థిరాస్థులు ఉంటే మంచిదని అంటుంటారు. మరి కొందరు గవర్నమెంట్ జాబ్ లేదా సాఫ్ట్ వేర్ కొలువు ఉండాలని కోరుకుంటారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధమైన ఆసక్తితో ఉంటారు. అందుకు సంబంధించి వివిధ మోట్రిమోనీ సైట్లలో ప్రకటనలు కూడా ఇస్తుంటారు. కొందరు సోషల్ మీడియాలోనూ తమ వివరాలను పోస్ట్ చేస్తుంటారు. ఇదంతా సాధారణమే. కానీ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పెళ్లి ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అందులో వధువు లేదా వరుడి వింత కోరికలు చూసి పలువురు ఆశ్చర్యపోతుంటారు. అలాంటి పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో ఏముందంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఓ మహిళ బీఈడీ చదివింది. ఉద్యోగం చేస్తూ నెలకు రూ. 1.3 లక్షలు సంపాదిస్తోంది. కాగా ఆమెకు ఇంతకు ముందే పెళ్లి అయింది కానీ.. వివాదాల కారణంగా విడాకులు తీసుకున్నది. ప్రస్తుతం రెండవ పెళ్లి చేసుకోవడానికి వరుడికోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలో తనకు కావాల్సిన సంబంధం ఎలా ఉండాలో వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. కండిషన్స్ అప్లై అని పేర్కొన్న సదరు మహిళ, సెకండ్ మ్యారేజ్ చేసుకునేందుకు తనకు వరుడు కావాలని, అతను ఎంబీఏ, ఎంఎస్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ ఉండాలని పేర్కొన్నది. పైగా అతనికి రూ. 30 లక్షల జీతం (వార్షిక వేతనం), 3 బీహెచ్‌కే ఇల్లు ఉండాలని, అంతేకాకుండా వరుడికి తల్లిదండ్రులు, అంటే తనకు అత్తా మామా ఉండకూడదని పేర్కొంటూ ఇచ్చిన పెళ్లి ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఒకవేళ వరుడికి పేరెంట్స్ ఉన్నా పెళ్లి తర్వాత అతనితో ఉండకూడని, విడిగా ఉండాలని, తన తల్లిదండ్రులు మాత్రం తనతో ఉంటారని ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఇంటి పనులు చేయడానికి ఎప్పుడూ ఒక పనిమనిషి ఉండాలని పేర్కొన్నది. ఇలాంటి అర్హతలు ఉన్న వరుడు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే ఇది బిజినెస్ ఒప్పందంలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
Her qualities and salary 🤡Expected husbands qualities and salary🗿🗿 pic.twitter.com/NGgJvVvN9l
— ShoneeKapoor (@ShoneeKapoor) September 10, 2024
post video credits to snoneekapoor on X Id