Valentine's Day : ‘ఐ లవ్ యూ’ చెప్పే ముందు ఈ నిబంధనలు పాటించకపోతే మీ లవర్ హ్యాండివ్వడం పక్కా

by Sujitha Rachapalli |
Valentines Day : ‘ఐ లవ్ యూ’ చెప్పే ముందు ఈ నిబంధనలు పాటించకపోతే మీ లవర్ హ్యాండివ్వడం పక్కా
X

దిశ, ఫీచర్స్ : నచ్చిన వ్యక్తితో ప్రత్యేక బంధాన్ని ముడివేసుకోవాలని ఆరాటపడుతున్నప్పుడు కొందరు మొదటి రోజే ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తారు. కానీ చాలా మంది ఈ పదాల వ్యక్తీకరణకు సమయం తీసుకుంటారు. ఎందుకంటే ‘ఐ లవ్ యూ’ అనే పదం డీప్ ఎఫెక్షన్, కమిట్మెంట్, ఎమోషనల్ కనెక్షన్‌ను కలిగి ఉంటుంది. జీవితాన్ని మరొకరితో పంచుకోవాలనే నిజమైన కోరికను తెలపడం. సంతోషకరమైన క్షణాలలో మాత్రమే కాకుండా సవాళ్లు, ఇబ్బందుల్లో కూడా తోడుంటామని హామీ ఇవ్వడం. రెండు జీవితాలు అర్థవంతమైన మార్పును చూడబోతున్నాయని చెప్పడం. మరి మీరు మీ భాగస్వామి ముందు ఆ భావాన్ని వ్యక్తీకరించేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో ఇలా తెలుసుకోండి.

లోతైన భావోద్వేగ సంబంధం: మీరు మీ భాగస్వామితో దృఢమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకున్నారని, అర్థవంతమైన క్షణాలను పంచుకున్నారని భావిస్తే చెప్పేయొచ్చు.

పరస్పర నమ్మకం: ఏదైనా సంబంధానికి విశ్వాసమే పునాది. మీరు మీ భాగస్వామిని పూర్తిగా నమ్మితే.. వారు కూడా అలాగే ఉన్నారని తెలిస్తే..మీ ప్రేమ భావాలను వ్యక్తీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే.

గౌరవం: నిజమైన ప్రేమ పరస్పర ప్రశంస, గౌరవంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుంచి ప్రేరణ పొంది వారి లక్షణాలను విలువైనదిగా భావిస్తే మీ లవ్‌ను ఎక్స్‌‌ప్రెస్ చేయొచ్చు‌‌.

అన్‌కండిషనల్ సపోర్ట్: మీ భాగస్వామి మంచి, చెడు అన్ని సమయాల్లో మీకు మద్దతు ఇస్తున్నారని భావిస్తే.. ఇది ప్రేమకు స్పష్టమైన సంకేతం. శాశ్వత సంబంధానికి షరతులు లేని మద్దతు అవసరం. కాబట్టి మీరు మీ ప్రేమను వ్యక్తపరిచే సమయం వచ్చినట్లే.

దీర్ఘకాలికంగా ఆలోచించడం: మీరు మీ భాగస్వామితో భవిష్యత్తును ఊహించుకుని, కలిసి ప్రణాళికలు వేస్తే, ఇది అవధులు లేని ప్రేమను సూచిస్తున్నట్లే. ఎవరితోనైనా భవిష్యత్తు గురించి ఆలోచించడం అనేది కమిట్మెంట్, డీప్ లవ్‌కు సంకేతం.

భాగస్వామ్య ఆనందం: మీ భాగస్వామి ఆనందం మీ ఆనందం వలె ముఖ్యమైనది. వారు సంతోషంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటే, అది ప్రేమకు మంచి సూచిక.

Next Story

Most Viewed