పీరియడ్స్‌‌‌‌‌‌లో హెవీ బ్లీడింగ్‌తో గుండె పోటు.. ఎందుకిలా జరుగుతుందంటే..

by Sujitha Rachapalli |
periods
X

దిశ, ఫీచర్స్: మహిళలకు పీరియడ్ సైకిల్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. అలాగే ఆ సమయంలో వచ్చే నొప్పి కూడా ఒకరి నుంచి మరొకరికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ టైంలో బ్లీడింగ్ విషయంలో కూడా వైవిధ్యం ఉంటుంది. వీరిలో హెవీ బ్లీడింగ్ అయ్యేవారికి చాలా రకాల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తుంటారు. సరైన ట్రీట్మెంట్ అవసరమని హెచ్చరిస్తుంటారు. రుతుక్రమంలో అధికంగా రక్తం పోవడాన్ని Menorrhagia అని పిలుస్తుండగా.. దీనివల్ల ఫిజికల్, మెంటల్, సోషల్ బిహేవియర్, లైఫ్ క్వాలిటీపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ట్రీట్మెంట్ కు డబ్బులు అధికం కావడంతో ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది. చేసే పనిపై సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోవడంతో ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వీటితోపాటు రక్తహీనత, అలసట, తలనొప్పి, అసౌకర్యం వెంటాడతాయి.

అయితే Menorrhagia మరియు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా మధ్య లింక్ గుండెకు ఆక్సిజన్ బదిలీని అడ్డుకుంటుంది. గుండె పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుందని లేటెస్ట్ స్టడీ తెలిపింది. 18-70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న మహిళలపై చేసిన అధ్యయనం ఈ ఫలితాన్ని వెల్లడించింది. ఋతుస్రావం ఎక్కువగా జరిగితే స్ట్రోక్, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్, మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్స్ కు దారితీస్తుందని హెచ్చరించింది. కాగా ఈ అధ్యయనంలో వయసు, జాతి, ఉద్యోగం, ధూమపానం, మద్యపానం, గర్భనిరోధక మాత్రల వినియోగం, ఫైనాన్షియల్ బర్డెన్ ఇలా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed