- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లం తీసుకోకూడదు.. వీరికి అది విషంతో సమానం..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మనం అల్లం లేకుండా నాన్‌వెజ్ కూరలు వండుకోము అని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. మరికొంత మంది వెజ్ కర్రీస్‌లలో కూడా అల్లం వాడుతుంటారు. అల్లంలో చాలా పోషకాలున్నాయి. ఎన్ని లాభాలు ఉన్నా అల్లం ఎక్కువగా తినడం ముఖ్యంగా ఈ రోగులకు అస్సలు మంచిది కాదు. ఇది వారికి విషంతో సమానమని అంటున్నారు నిపుణులు. మరి ఏ వ్యాధి గ్రస్తులు అల్లం తీసుకోకూడదో ఇప్పుడు మనం చూద్దాం..
ప్రెగ్నెంట్ ఉమెన్స్:
గర్భధారణ సమయంలో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కండరాల నొప్పులు ఏర్పడి, నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తుంది. చాలా మంది వైద్యులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చివరి మూడు నెలలు అల్లం తినకూడదని సలహా ఇస్తారు. ప్రెగ్నెన్సీ ప్రారంభంలో మార్నింగ్ సిక్ నెస్ నుంచి బయటపడేందుకు మాత్రం కొద్దిగా అల్లం తినవచ్చు.
హేమోఫిలియా సమస్య ఉన్నవారు:
హిమోఫిలియా అనేది జన్యుపరమైన రుగ్మత. క్లాటింగ్ ప్రోటీన్ లేనప్పుడు రక్తం గడ్డకట్టదు. చిన్న కోత జరిగినా విపరీతమైన రక్తస్రావం జరిగి ఒకొక్కసారి మరణానికి కూడా కారణమవుతుంది. కనుక హేమోఫిలియా మందులను తీసుకునే వారు అల్లం తీసుకోవడం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది.
బరువు పెరగాలి అని అనుకునే వారు:
అధిక బరువు ఎంత పెద్ద సమస్యో తక్కువ బరువు ఉండటం కూడా అంతే పెద్ద సమస్య. బరువు పెరగాలని ప్రయత్నిస్తే అల్లం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి. అల్లంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపులోని pH స్థాయిని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ప్రతిరోజూ అల్లం తినడం వల్ల జుట్టు రాలడంతో పాటు, బహిష్టు సక్రమంగా రాకుండా పోతుంది.
హైపర్ టెన్షన్ లేదా డయాబెటిస్ ఉన్నవారు:
హైపర్ టెన్షన్ లేదా డయాబెటిస్ మెడిసిన్ తీసుకునే వారు కూడా అల్లం తక్కువగా తినడం మంచిది. అల్లం రక్తం పల్చబడేటట్లు చేసి తద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. కనుక అల్లం సాధారణంగా ఆరోగ్యానికి ప్రయోజనకరమైనప్పటికీ ఇది యాంటీ కోగ్యులెంట్స్, బీటా-బ్లాకర్స్ లేదా ఇన్సులిన్ వంటి మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.