Trending : ఆలోచనల్లో మార్పు.. 2025లో Gen Z థాట్స్ ఇవే..!

by Javid Pasha |
Trending : ఆలోచనల్లో మార్పు.. 2025లో Gen Z థాట్స్ ఇవే..!
X

దిశ, ఫీచర్స్ : ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం.. ప్రతీ గంట.. ప్రతీ రోజు.. ఇలా చూస్తుండగానే అలా గడిచిపోతుంటాయ్.. అవును మరి కాలం ఎవరి కోసమూ ఆగదు. ఎవరి మీదా దానికి దయ, జాలి, ప్రేమ, అసూయ, పక్షపాతం వంటివి ఏవీ ఉండవు. అందరికీ ఒకేలా వర్తిస్తుంది. మనకు నచ్చినా నచ్చక పోయినా, మనం మారినా, మారకపోయినా కాలానికి సంబంధం లేదు. అది మాత్రం మారుతూనే ఉంటుంది. తన పనేదో తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మనం కూడా కాలంతోపాటు పరుగెత్తాలి. కాలాన్ని అర్థం చేసుకోకపోతే, కాలం విలువ తెలుసుకోవాలి. లేకపోతే అక్కడే ఆగిపోతాం.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఈ క్రమంలో యువత, సంబంధాల విషయంలో ఎలా ఆలోచిస్తోంది? ఏ విధమైన మార్పు కోరుకుంటుందో కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సంబంధాల్లో మార్పు

నిజం చెప్పాలంటే సమాజంలో ప్రతీదీ మార్పునకు లోబడే ఉంటుంది. అంతెందుకు కొన్ని రోజుల్లోనే మనం కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ఇది మార్పే కదా.. అయితే కాలమొక్కటే కాదు. మనుషులు, మానవ సంబంధాల్లోనూ మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా రాబోయే 2025 సంవత్సరంలో 2024లోని ట్రెండ్స్ అన్నీ పాతబడిపోతాయి. అవసరం అయినవి కొన్ని స్పీడప్ అవుతాయి లేదా మరింత మెరుగైన దిశగా మారుతాయి. అలాంటివాటిలో మానవ సంబంధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జెన్ జీ డేటింగ్ స్టైల్ కూడా మారనుందని నిపుణులు అంటున్నారు. న్యూ జనరేషన్ డేటింగ్ ట్రెండ్స్ కాంప్లికేటెడ్ నుంచి మరింత సింప్లిసిటీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెల్ఫ్ కేర్, ఇంప్రూవ్‌మెంట్

ఈ ఏడాదంతా ఎలాగో గడిచిపోయింది. కొందరు సంతోషంగా, సానుకూలంగా భావించి ఉండవచ్చు. మరికొందరు గజిబిజిగా, గందరగోళంగా గడిచిందని బాధపడుతుండవచ్చు. ఎలా భావించేవారైనా మారాల్సిందే. అయితే వచ్చే సంవత్సరం ప్రజలు ఎక్కువగా, ముఖ్యంగా యువత వ్యక్తిగత సంరక్షణ, వ్యక్తిగత ఎదుగుదల, మానసిక ఆనందం, ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

‘క్రాస్ - జనరేషన్’ డేటింగ్

ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా మానవ సంబంధాల్లో ప్రతీ సంవత్సరం మార్పులు వస్తూనే ఉన్నాయి. ఒకప్పటిలా యువత మరీ ట్రెడిషనల్‌గా ఉండటానికి ఇష్టపడటం లేదు. అందుకే రాబోయే సంవత్సరంలో రిలేషన్‌షిప్స్ విషయంలోనూ మరిన్ని మార్పులు వస్తాయి. ముఖ్యంగా ‘క్రాస్ - జనరేషన్ డేటింగ్’ ట్రెండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024లోనే ఇది ప్రారంభమైంది. కాకపోతే 2025లో ఇది మరింత పెరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఏజ్ గ్యాప్ రిలేషన్స్, మ్యారేజెస్ వంటివి చాలా కామన్ విషయాలుగా మారనున్నాయి.

రిలేషన్ షిప్‌లో కొత్త పోకడలు

ఓ డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం.. దాదాపు 20% జన్ జీ (Gen Z)లు, అలాగే టైర్ 1, టైర్ 2 సిటీలలో నివసించే మిలీనియల్స్ కూడా సేమ్ ఏజ్ వారితో కాకుండా వయస్సులో తమకంటే చిన్న వారితో లేదా పెద్ద వారితో కూడా డేటింగ్ కొనసాగించారు. ఈ పరిస్థితి మోడర్న్ అండ్ ట్రెడీషనల్ వాల్యూస్ యొక్క స్పెషాలిటీని కలగలిపే మరో కొత్తపోకడలకు దారితీసింది. 2025లో ఇది సాధారణ విషయంగా మారిపోనుంది. వయస్సుతో సంబంధం లేకుండా మెచ్యూరిటీ లెవల్‌లో సరిపోతారని భావించనంతకాలం రిలేషన్‌సిప్‌ను కొనసాగించడానికే అత్యధిక మంది మొగ్గు చూపనున్నారట.

మెంటల్ హెల్త్‌పై ఫోకస్

వచ్చే సంవత్సరంలో మరో మార్పు ఏంటంటే.. యువత డేర్ అండ్ డ్యాష్ టైప్‌లో భావ వ్యక్తీకరణలో ముందుండే చాన్స్ ఉంటుంది. లెస్ కన్వర్జేషన్స్ చుట్టూ పెరుగుతున్న యాంగ్జైటీని యంగ్ జనరేషన్ సహించే పరిస్థితి ఉండదు. అలాగే ఎమోషనల్ సపోర్ట్‌కు ప్రయారిటీ పెరుగుతుంది. ఇక డేటింగ్ యాప్స్ యూజర్లలో అయితే మూడవ వంతు మంది సెక్స్ కంటే భావోద్వేగ సాన్నిహిత్యమే ముఖ్యమని, ఫిజికల్ కనెక్షన్ కంటే కూడా అదే అట్రాక్టివ్‌గా ఉటుందని చెప్తున్నారు. ఓ డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం.. 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు గల స్త్రీలలో 33% మంది తమ వ్యక్తిగత, సామాజిక భావాలు, భావోద్వేగాలను షేర్ చేసుకునేందుకు సుఖవంతమైన బంధాల వైపు మొగ్గు చూపనున్నారు. మొత్తానికి 2025 ‘జెన్ డేటింగ్’ ఇయర్ అవుతుంది. ఇక సింగిల్స్ విషయానికి వస్తే తమ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి బయటపడుతూ డేటింగ్ స్పేస్‌లోకి అడుగు పెట్టే అవకాశం ఎక్కుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed