- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూలై 4 నుంచి ఈ రాశుల వారికి కష్టాలే...
దిశ, వెబ్ డెస్క్ : పరమ శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో ఈశ్వరుడిని కొలిస్తే.. అంతా మంచే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సారి శ్రావణ మాసం జులై 4న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. పండితులు సూచించన ప్రకారం.. ఈ శ్రావణ మాసంలో అనే గ్రహాలు, రాశులు తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. అందుకే గ్రహాల కదలిక వల్ల కొన్ని రాశులపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొన్ని రాశులకు మంచి జరిగితే.. కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. శ్రావణ మాసం ఇబ్బందులు తలెత్తే రాశుల గురించి ఇప్పడు తెలుసుకుందాం..
వృషభ రాశి..
శ్రావణ మాసంలో వృషభ రాశి వారు కష్టాలు ఎదుర్కొంటారు. శారీరక, మానసికంగా సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. అనవసర ఖర్చులు, వ్యాపారానికి నిర్ణయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. పెద్ద పెద్ద నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. సమస్యల అధిగమించేందకు శివారాధనే మార్గం.
కర్కాటక రాశి..
ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ప్రశాంతత దూరమవుతుంది. అలాగే దంపతుల మధ్య మనస్పర్ధలు, శారీరక శ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కన్యా రాశి..
శ్రావణ మాసం మొత్తం ఒడిదొడుకులతో సాగనుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చు నివారింకోవాలి. శివారాధన, లింగా జలాభిషేకం చేయాలి.
తులా రాశి..
అనవసర ఖర్చులు నివారించకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. డబ్బు ఆదా చేసేందుకు శాయశక్తుల ప్రయత్నించాలి. ఉద్యోగులకు సమస్యలు తప్పవు. వ్యాపారులకు నష్టభయం ఉంటుంది. శివ నామాలు, ఓం నమ: శివామ మంత్రం జపించాలి.
మకర రాశి..
శ్రావణ మాసంలో ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు వీలైనంతగా తగ్గించుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఓపిక ముఖ్యం, భాగస్వామి పట్ల ప్రేమను చూపించండి.
కుంభ రాశి..
వ్యాపారంలో భాగస్వామితో విభేదాలు, వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్త. గాసిప్స్ కు దూరంగా ఉండాలి. శివుడికి అభిషేకం శ్రేయస్కరం.
మీన రాశి..
ఉదర సంబంధిత రుగ్మతలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కొన్ని విషయాల్లో రాజీ పడండి. చాలా ఓపికగా ఉండి పనులు పూర్తి చేయాలి. ఇతరులను ఏమాత్రం అవమానించకూడదు.
Read More: ఈ పేర్లున్న అమ్మాయిలు కోడలిగా వస్తే అత్తింటి వారికి ఆకస్మిక ధన లాభం