ముఖంపైనే సెక్స్.. రాత్రైతే చాలు అదే పని! (వీడియో)

by Nagaya |   ( Updated:2023-10-06 08:38:59.0  )
ముఖంపైనే సెక్స్.. రాత్రైతే చాలు అదే పని! (వీడియో)
X

దిశ, ఫీచర్స్: రాత్రి పూట మీ ముఖంపై పురుగులు నివాసిస్తాయని మీకు తెలుసా? సంభోగంతోపాటు పిల్లలను కూడా కనేస్తాయని, ఆ తర్వాత చనిపోయి కుళ్ళిపోతాయని ఎప్పుడైనా ఊహించారా? కానీ ప్రతీ రోజు ఇదే జరుగుతుందని తెలిపాడు శాస్త్రవేత్త జేమ్స్ వీస్. 0.15 నుంచి 0.4 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ డెమోడెక్స్ సూక్ష్మజీవులు.. అన్ని క్షీరదాలపై జీవిస్తాయని చెప్తున్నాడు. ఏకంగా తన ముఖంపైనే మైక్రోస్కోపిక్ లెన్స్ కింద క్యాప్చర్ చేసిన పురుగులను షేర్ చేశాడు.


ఈ జీవులను మొదటిసారిగా 1842లో జర్మన్ చర్మవ్యాధి నిపుణుడు గుస్తావ్ సైమన్ కనుగొన్నాడు. కానీ 200 సంవత్సరాల తర్వాత కూడా ఈ పురుగులు క్షీరదాలపై ఎందుకు నివసిస్తాయో శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. అయితే అవి కాలక్రమేణా మనతో కలిసి పరిణామం చెందాయని మాత్రం గుర్తించారు. కాగా రాత్రి సమయంలో ఇతర పురుగులతో జతకట్టడానికి బయటకు వస్తాయని.. సంభోగం పూర్తయిన తర్వాత.. ఆడ పురుగులు మూడు నుంచి నాలుగు రోజులలో గుడ్లను పెట్టడానికి చర్మ రంధ్రాలలోకి ప్రవేశిస్తాయని వివరించారు. మగ పురుగులు కొన్ని వారాలు మాత్రమే జీవించి, ముఖంపైనే కుళ్ళిపోతే.. ఆడ పురుగులు మాత్రం 70 రోజుల వరకు జీవించగలవు. వాటి జీవితకాలంలో 100 గుడ్లు పెట్టగలవు. ఇక ముఖం, ముక్కు, జఘన ప్రాంతాలు, చెవి కాలువలతో సహా శరీరంలోని జిడ్డుగల భాగాలలో కూడా కనిపించే ఈ చర్మపు పురుగులు.. మానవులకు ఎటువంటి హాని కలిగించకపోగా, చర్మ సూక్ష్మజీవులను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

Also Read..

రోజుకు ఇన్ని అడుగులు నడిస్తే ఏ వ్యాధులు మీ దరిచేరవు..!

Advertisement

Next Story

Most Viewed