- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి?
దిశ, వెబ్‌డెస్క్: జీవన శైలిలో మార్పుల కారణంగా ప్రస్తుత రోజుల్లో బరువు సమస్య సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. శరీరాకృతి మారడం వల్ల అందాన్ని కోల్పోతారు. ఇక కామన్ గా బరువు పెరిగినప్పుడు ఫేస్ కూడా లావుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది తెగ ఫీల్ అయిపోతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే మరి ఎక్కువగా ఫేస్ గురించి దిగులు చెందుతారు. పైగా ఇంకో వారం రోజుల్లో తెలంగాణ పెద్ద పండుగ అయిన బతుకమ్మ రాబోతుంది. కొత్త బట్టలు వేసుకుని అందంగా ముస్తాబయ్యాక స్మార్ట్ ఫోన్లలో ఫొటోలు దిగితే ముఖం మందంగా కనిపిస్తుంది. కాగా ఫేస్ ఫ్యాట్ తగ్గించి.. అందంగా కనిపించాలంటే ఈ ఈజీ టిప్స్ ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దామా.
కొవ్వు పెరగడానికి కారణాలు..
శరీరంలో వాటర్ శాతం తక్కువగా ఉంటే ఫేస్ పై కొవ్వు పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం, అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల కారణంగా, హార్మోన్లలో మార్పులు వంటివి ముఖంపై ఫ్యాట్ పెరుగుతుంది.
ఫేస్‌పై ఫ్యాట్ ను తగ్గించే మార్గాలు..
కూల్ వాటర్ తో ఫేస్ కడగండి. దీంతో బ్లడ్ సర్కులేషన్ సక్రమంగా జరుగుతుంది. ఒక క్లాత్ తీసుకుని ఐస్ ముక్కల్ని అందులో వేసి.. ఫేస్ పై మసాజ్ లాగా చేసుకోండి. దీంతో వాపు తగ్గుతుంది. అలాగే దోస ముక్కల్ని పేస్ట్‌లా చేసి ఫేస్ పై అప్లై చేయండి. దీంతో కళ్ల చుట్టూ వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే గ్రీన్ టీ బ్యాగ్ లను చల్లార్చి ఫేస్ పై కాసేపు అలా ఉంచండి.
అలోవెరా జెల్ వాడండి..
అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుంటే వాపు తగ్గుతుంది. దీనిలో పోషకాలు వాపు తగ్గించడంలో మేలు చేస్తాయి. కేవలం వాపు మాత్రమే కాకుండా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ఈ చిట్కాలు వరుసగా వారం రోజులు కనుక ఫాలో అయితే మీ అనుకున్న మీ ముఖ అందం మీ సోంతం అవుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.