వాటర్ ట్యాంకులో నీళ్లు వేడెక్కుతున్నాయా?.. చల్లదనం కోసం ఇలా చేయాలంటున్న నిపుణులు

by Dishafeatures2 |
వాటర్ ట్యాంకులో నీళ్లు వేడెక్కుతున్నాయా?.. చల్లదనం కోసం ఇలా చేయాలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ ఎండలు అధికం అవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణో్గ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేడి వాతావరణంవల్ల ఇంటి డాబాబపై ఉండే నీళ్ల ట్యాంకర్లు, నీళ్లు కూడా హీటెక్కుతున్నాయి. వివిధ పనుల మీద బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి వచ్చాక చల్లటి నీటితో స్నానం చేద్దామని నల్లా తిప్పగానే ఒక్కసారిగా పొగలు కక్కుతున్న వేడి నీళ్లే దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

* ఒకప్పుడు డాబాలపై వాటర్ ట్యాంకర్లు కూడా ఇటుకతో కట్టి, సిమెంట్ చేసే వారు. వాటిలో నీరు వేడెక్కకుండా ఉండేది. కానీ ప్రస్తుతం దాదాపు అందరూ ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, అవి కూడా బ్లాక్ కలర్‌వే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఎండకు ట్యాంకర్‌తోపాటు అందులోని నీరు త్వరగా వేడెక్కుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వైట్ కలర్ ట్యాంకర్లు వాడాలి. ఒకవేళ అప్పటికే బ్లాక్ కలర్ ట్యాంకర్ ఉండి ఉంటే వైట్ పెయింట్ వేయించడం బెటర్. దీంతో నీరు త్వరగా వేడెక్కదు. పైగా ఎక్కువసేపు చల్లగా ఉంటుంది.

*వేసవిలో కేవలం ట్యాంకర్ వేడెక్కడం ద్వారా మాత్రమే కాదు, పైపులు వేడెక్కడం ద్వారా కూడా హీటెక్కుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎండవేడిమి తాకకుండా పైపును కప్పి ఉంచేందుకు ఒక మందపాటి గోనెసంచి లేదా టార్ఫాలిన్‌ వంటివి ఉపయోగించవచ్చు. కుళాయిని కవర్లతో కప్పడంవల్ల కూడా నీరు వేడెక్కకుండా ఉంటుంది. అలాగే వాటర్ ట్యాంకర్ ఎండవేడి తగిలేచోట కాకుండా నీడ ఉండే ప్రదేశంలో ఫిక్స్ చేయడంవల్ల కూడా నీరు చల్లగా ఉంటుంది. అలాగే డాబాపై ఉండే వాటర్ ట్యాంక్ అడుగు భాగాన మట్టిని పోసి, దానిపై ట్యాంకర్‌ను అమర్చడం, కోన్ బ్యాగ్‌ లేదా టార్ఫాలిన్ వంటివి కప్పి ఉంచడంవల్ల కూడా ట్యాంకర్‌లోని నీరు కాస్త చల్లగా ఉండే అవకాశం ఉంటుంది.

Next Story

Most Viewed