- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bathroom Geyser: బాత్రూంలోని గీజర్లు వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలంటున్న నిపుణులు
దిశ, ఫీచర్స్: వర్షాకాలంలో వాతావరణం చల్లబడుతుంది. దీంతో చాలా మంది వేడి నీటి స్నానం చేస్తుంటారు. కొందరు గీజర్లు వాడుతుంటారు. వీటిని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇళ్ళలో గీజర్‌ని వాడేవారు స్విచ్ ఆన్ చేసి అలాగే ఉంచుతారు కానీ ఇలా చేస్తే ప్రమాదంలో పడతారని అంటున్నారు. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు అలాగే ఉంచితే అది ఓవర్ హీట్ అయ్యి పేలి పోయే అవకాశం ఉంది. కాబట్టి మీ పని అయ్యాక స్విచ్ ఆఫ్ ఆపండి.
టెక్నాలజీ మారిపోవడంతో మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి వాటిలో ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యే గీజర్లు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో గీజర్ పాత మోడల్ ను వాడుతున్నట్లయితే ఆన్ అండ్ ఆఫ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి. గీజర్ పాడవ్వగానే కొందరు ఇంటర్నెట్ లో వీడియోలో చూసి రిపేర్ చేస్తుంటారు. కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోండి. లేదంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.గీజర్‌లో ఉండే బ్యూటేన్, ప్రొపేన్ గ్యాస్ ను విడుదల చేస్తాయి. దీని వలన ఈ గ్యాస్ వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.