రాత్రంతా ఫుల్లుగా ఏసీ ఆన్‌చేసి పడుకుంటున్నారా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు !

by Dishafeatures2 |
రాత్రంతా ఫుల్లుగా ఏసీ ఆన్‌చేసి పడుకుంటున్నారా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు !
X

దిశ, ఫీచర్స్ : వేసవి ప్రభావంతో అసలే ఎండలు మండుతున్నాయి. ఉక్కబోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణో గ్రతలతో పనులకు ఆటంకం కలుగుతోంటే.. రాత్రిపూట వేడిగాలులతో కంటి మీద కునుకు పట్టకపోవడంతో పలువురు చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్లను వాడుతన్నారు. చాలామంది రాత్రంతా ఏసీని ఆన్‌చేసి పడుకుంటున్నారు. కానీ ఇలా చేయడంవల్ల హాయిగా నిద్ర పడుతుందేమో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం.

* రాత్రిపూట ఏసీ ఆన్ చేసి పడుకోవడంవల్ల కాసేపటికి గది ఉష్ణోగ్రత చల్లగా మారుతుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తే చాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక ఆస్తమా, అలెర్జీలు వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మరింత పెరగవచ్చు. పిల్లల్లో జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంటుంది. పిల్లల్లో, వృద్ధుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక, ఛాతీ, కండరాలు బిగుసుకుపోవడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు.

* ఏసీలో రాత్రంతా ఆన్‌లో ఉండటంవల్ల శరీరంలోని తేమశాతం తగ్గిపోతుంది. దీంతో స్కిన్ ఇన్ఫక్షన్స్, అలెర్జీలు, కళ్లల్లో మంట, కళ్లు ఎరుపెక్కడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కండరాలు బిగుసుకుపోవడంవల్ల కీళ్ల నొప్పులు రావచ్చు. సాధారణ వాతావరణంలో ఉన్నవారితో పోల్చితే ఏసీలో రాత్రంతా గడిపేవారిలో రోగ నిరోధక శక్తి వేగంగా పడిపోతుందని, దీనివల్ల వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు.ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏసీ ఆన్ చేశాక, గది ఉష్ణోగ్రత చల్లబడే వరకు ఉంచి, ఆ తర్వాత ఆఫ్ చేసి నిద్రపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed