- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Do not share : ఇగో.. దోస్తులైనా సరే.. వీటిని షేర్ చేసుకోకండి.. డేంజర్లో పడతారు!!

దిశ, ఫీచర్స్ : బాధలు, భావేద్వోగాలు, ఆనందమయ క్షణాలు, తాము చేసే పనులు.. ఇలా ప్రతీ విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. వీటివల్ల ఏ సమస్య ఉండదు. ఆత్మీయులకో, కుటుంబ సభ్యులకో వాటిని చెప్పుకుంటే కాస్త రిలాక్స్ అవుతారు. ఇక నలుగురికి పనికొచ్చే విషయమైతే.. ఏ ఫేస్ బుక్‌లోనో, ఇన్ స్టాలోనో పంచుకుంటే మనసుకు సంతృప్తినిస్తుంది. ఏదో ఒక రూపంలో ప్రయోజనం చేకూరుతుంది. కానీ నిత్య జీవితంలో ఇతరులతో.. చివరికి దోస్తులతో, కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోకూడనివి కొన్ని ఉంటాయని మీకు తెలుసా? అలా చేస్తే నష్టపోతారు. అవేంటో చూద్దాం.
ఒకే సబ్బును అందరూ..
సబ్బు వాడటం పరిశుభ్రతలో భాగం. అయితే ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఒకే సబ్బును అందరూ వాడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. అట్లనే ఒకే రూమలో ఉండే బ్యాచిలర్స్, కొన్నిసార్లు హాస్టల్స్‌లోని రూమ్ మేట్స్ కూడా ఒకే సోప్‌ను వాడుతుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఈ అలవాటు హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకే సబ్బును అందరూ లేదా ఇద్దరు షేర్ చేసుకుంటే ఒకరికి ఉండే చర్మ వ్యాధులు, అంటు వ్యాధులు, అలర్జీలు మరొకరికి వ్యాపించవచ్చు. ఏవీ లేకపోయినా ఇలా వాడటంవల్ల కొత్త వ్యాధులు పుట్టుకురావచ్చు. తరచుగా ఓకే సబ్బును వాడటం ఇన్‌ఫెక్షన్లకు, స్కిన్ అలెర్జీలకు దారితీస్తున్నట్లు ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే షేర్ చేసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.
నెయిల్ క్టటర్
ప్రతీ ఇంట్లో దాదాపు ఒకే నెయిల్ కట్టర్ ఉంటుంది. అందరూ దానినే యూజ్ చేస్తుంటారు. అయితే ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బతీయవచ్చు. ఎందుకంటే గోర్లల్లో బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి వంటివి ఉంటాయి. కొన్నిసార్లు అవి ప్రమాదకరమైనవి అయితే.. సదరు వ్యక్తి వాడిన నెయిల్ కట్టర్‌ను మరొకరు వాడితే.. వారికి కూడా ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు తలెత్తే చాన్స్ ఉంటుంది. అందుకే నెయిల్ కట్టర్ షేర్ చేసుకోవద్దు అంటున్నారు నిపుణులు.
రేజర్ లేదా షేవింగ్ కిట్
ఒకే ఇంట్లో ఉండే అందరు వ్యక్తులు, ఒకే రూముల్లోని బ్యాచిలర్స్ కొన్నిసార్లు షేవింగ్ చేసుకునే రేజర్, సోప్, బ్రష్ వంటివి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా డేంజర్. ఇలా చేయడంవల్ల చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా అలర్జీలు, అంటు వ్యాధులకు ఈ అలవాటు ప్రధాన కారణం అవుతుంది. సో.. ఎట్టి పరిస్థితుల్లోనూ షేవింగ్ కిట్స్, రేజర్ వంటివి పంచుకోవద్దని గుర్తుంచుకోండి.
వాటర్ బాటిల్, ప్లేట్, డ్రెస్
చాలామంది ఇండ్లల్లో ఒకే ప్లేట్, ఒకే వాటర్ బాటిల్ వాడటం కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ప్లేస్‌లలో, ప్రయాణాల్లో కూడా ఇతరుల వద్ద వాటర్ బాటిల్స్ కనిపిస్తే అడిగి మరీ తాగేస్తుంటాం. అలాగే గ్లాసు లేదా చెంబుతో నీళ్లు తాగుతున్నప్పుడు కాస్త పైనుంచి కాకుండా, వాటికి పెదాలు ఆనించి తాగుతుంటారు కొందరు. అలా ఒకరు తాగిన తర్వాత, ఇతరులు తాగడం, షేర్ చేసుకోవడం డేంజర్ అని, రోగాలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అలర్జీలు, గొంతు ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి, ఇతర అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే వాటర్ బాటిల్‌ను అందరూ షేర్ చేసుకోవద్దు. అట్లనే ఒకరు వాడిని డ్రెస్సులు మరొకరు, ఒకరు వాడిన షూ మరొకరు షేర్ చేసుకోవడం కూడా డేంజరే.