- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Weight loss : ఒబేసిటీతో బాధ పడుతున్నారా?.. రాత్రివేళ ఈ పని మాత్రం అస్సలు చేయకండి !
దిశ, ఫీచర్స్ : మీరు అధిక బరువు లేదా ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ ప్రాబ్లం నుంచి బయట పడేందుకు రాత్రిపూట తినడం మానేస్తున్నారా? ఈ పని మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇలా దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఒబేసిటీ తగ్గకపోగా ఇతర హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వీటి నుంచి బయటపడేందుకు పలువురు వ్యాయామాలు చేయడం, ప్రత్యేకంగా డైట్స్ పాటించడం వంటి పద్ధతులు పాటిస్తుంటారు. మరికొందరు ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు చేయడం, రాత్రి పూట తిండి మానేయడం చేస్తుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని నిపుణులు అంటున్నారు.
వాస్తవానికి నిద్రవేళకు గంట ముందు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నివేదికలు పేర్కొంటున్నాయి. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి లభిస్తాయి. అయితే బరువు తగ్గాలనే ఉద్దేశంతో డిన్నర్ మానేస్తే గనుక తగిన పోషకాలు అందక హెల్త్ ఇష్యూస్ తలెత్తుతాయి. పైగా ఇలా చేయడంవల్ల మరుసటి రోజు ఆకలి ఎక్కువగా వేస్తుంది. క్రమంగా తినాలనే కోరిక రెట్టింపు అవుతుంది. కొంతకాలం అలాగే చేస్తూ ఉంటే ఈటింగ్ డిజార్డర్ సమస్యలు తలెత్తుతాయి.
డిన్నర్ మానేయడంవల్ల షుగర్ లెవల్స్‌లో హెచ్చు తగ్గులు, శరీరంలో తిమ్మిరి లేదా వణుకు వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా తగిన పోషకాలు అందకపోవడం వల్ల డిప్రెషన్ యాంగ్జైటీస్, నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని 2020 నాటి ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి రాత్రిపూట డిన్నర్ మానేయడం కరెక్ట్ కాదని, కాకపోతే రాత్రిపూట ఆలస్యంగా తిన కూడదని నిపుణులు చెప్తున్నారు. నిద్రవేళకు ఒకగంట ముందు తినడం మంచిది.