- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైఫ్ క్వాలిటీని పెంచుతున్న మ్యూజిక్.. సవాళ్లను అధిగమించడంలోనూ
దిశ, ఫీచర్స్ : ‘సంతోషం సగం బలం’ అంటారు కానీ.. మ్యూజిక్ కూడా ఆ స్థానాన్ని ఆక్రమించింది. ‘సంగీతం సగం బలం’ అని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ఇది వ్యక్తుల్లో ఆనందాన్ని కలిగించడమే కాకుండా, దుఃఖాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ప్రేరేపిస్తుందని, జీవన నాణ్యతను, మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక వ్యక్తిలోని ప్రతికూల భావాలను, బాధలను దూరం చేసి, పాజిటివ్ ఫీలింగ్స్‌ను, హ్యాపీనెస్ మూవ్‌మెంట్స్‌ను క్రియేట్ చేయడంలో నిజంగానే మ్యూజిక్ గొప్ప మాయ చేస్తుంది అంటున్నారు థెరపిస్టులు.
భావ వ్యక్తీకరణలో కీ రోల్
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటీవలి నివేదిక ప్రకారం కూడా సంగీతం, కళలు వంటివి దీర్ఘకాలిక దుఃఖాలను తట్టుకోవడంలో, అనారోగ్యాల సందర్భంలో ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. ఇక చరిత్రలో సంగీతానికున్న ప్రాముఖ్యత తక్కువేం కాదు. గ్యారీ బార్లో రచించిన ‘లెట్ మీ గో’, ఎరిక్ క్లాప్టన్ యొక్క ‘టియర్స్ ఇన్ హెవెన్’, అలాగే మైక్ అండ్ మెకానిక్స్ రాసిన ‘ది లివింగ్ ఇయర్స్’ వంటి పాటలు, వాటి వెనుకున్న సంగీతం ఎంతోమందిని అలరించింది. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన ఎంతో మంది దుఃఖాన్ని అధిగమించడానికి ఇవి మ్యూజిక్ థెరపీ సెషన్లలో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మాటల్లో చెప్పలేని భావాలను పలకడంలో, గుర్తించడంలో, మేనేజ్ చేయడంలో సంగీతం అద్భుతాలు చేస్తుందట.
గ్రేట్ కమ్యూనికేటర్
సంగీతం వివిధ మార్గాల్లో ప్రజలు బాధలను మరిచిపోవడంలో సహాయపడే గ్రేట్ కమ్యూనికేటర్ అంటున్నారు నిపుణులు. ఆధ్యాత్మికతను అన్వేషించడానికి, సవాలు చేసే భావోద్వేగాలను మేనేజ్ చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. పదాలలో చెప్పలేనివి లేదా వర్ణించలేని బాధాకర పరిస్థితిని, సంతోషాన్ని, సందర్భాన్ని కూడా మ్యూజిక్ థెరపీలో వ్యక్తీకరించే అవకాశం ఉందట. హృదయాంతరాలను కదిలించేదిగా, జ్ఞాపకాలను తట్టిలేపేదిగా సంగీతం కీ రోల్ పోషిస్తుంది. వినడం వల్ల శారీరక, మానసిక బాధలను కూడా మరిపిస్తుందట. అలాగే ‘ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్’లో ఎంతోమందికి మ్యూజిక్ థెరపీ ఒక ప్రత్యామ్నాయ చికిత్సగానూ మారుతోంది.
రుగ్మతలను దూరం చేయడంలో..
మ్యూజిక్ దీర్ఘకాలిక మానసిక రుగ్మతలను దూరం చేయడంలో సహాయపడుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఒకే సెషన్‌లో ఇది బాధిత వ్యక్తికే కాకుండా, వారితోపాటు ఉండే కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుందని ఆయా వ్యక్తుల అనుభవాలను ఎనలైజ్ చేసిన థెరపిస్టులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బాధతలను తట్టుకునే సామర్థ్యాన్ని, లైఫ్ క్వాలిటీని, మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ, ఐసోలేషన్, కుటుంబ సంఘర్షణ, పూర్ సోషల్ సపోర్ట్ వంటి బాధాకర సందర్భాల్లో బలహీనతలను అధిగమించడంలో మ్యూజిక్ లేదా మ్యూజిక్ థెరపీలు గొప్పగా సహాయపడుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
Read More..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటిక ఏది.. అలా ఎందుకు పిలుస్తారు.. ?