Dating trends : మగాళ్లు మహా రసికులు.. అక్కడా అదేతీరు!

by Javid Pasha |
Dating trends : మగాళ్లు మహా రసికులు.. అక్కడా అదేతీరు!
X

దిశ, ఫీచర్స్ : పేరు ఏదైతేనేం.. ఈ రోజుల్లో ఏదో ఒక డేటింగ్ యాప్‌ను యూజ్ చేస్తున్న స్త్రీ, పురుషుల సంఖ్య పెరుగుతోంది. తప్పేముంది? అనుకుంటున్నారా? నథింగ్.. కానీ ఇక్కడే కొందరు తప్పుదోవ పడుతున్నారు. మరికొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. డేటింగ్ యాప్‌లలో పరిచయమై.. ప్రేమ పేరుతో దగ్గరై.. మోజు తీరాక మోసం చేస్తున్నారు. మరికొందరు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే డేటింగ్ యాప్‌లవల్ల లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా!

*ఒంటరి వ్యక్తులైనా, తుంటరి వ్యక్తులైనా డేటింగ్ యాప్‌లలో ఎంటరవ్వడానికి ఆసక్తి చూపుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అభిప్రాయాలు కలిసినోళ్లతో కలిసిపోయేందుకు, లవ్ అండ్ రొమాంటిక్ పార్ట్‌నర్స్‌ను వెతుక్కునేందుకు డేటింగ్ యాప్‌లు, సైట్లు వేదికగా ఉంటున్నాయి. అందుకే జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి కొందరు. పెళ్లి అయి, భాగస్వామి ఉన్నప్పటికీ ఎక్స్‌ట్రా మారిటల్ ఎఫైర్ కోసం మరికొందరు వీటిని ఆశ్రయిస్తున్నారని సర్వేలు సైతం పేర్కొంటున్నాయి.

*డేటింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్న వారిలో స్త్రీ, పురుషులు ఉంటున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో పురుషులే ఉంటున్నారని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ హెల్త్ సైకాలజీ నివేదిక పేర్కొంటున్నది. అధ్యయనంలో భాగంగా నిపుణులు 25 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు గల 289 మందిని ప్రశ్నించారు. డేటింగ్ యాప్‌లలో ఎంత సమయం గడుపుతున్నారు? ఎందుకు యూజ్ చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. కాగా ఎక్కువ మంది పురుషులు లైంగిక సంబంధాలకోసమే వీటిని ఆశ్రయిస్తున్నట్లు తేలింది.

*ఇక డేటింగ్ యాప్‌లలో ఒకరికంటే ఎక్కువమందితో ఛాటింగ్‌లు, ప్రేమలు, సంబంధాలు కొనసాగిస్తున్న వారిలో స్త్రీలకంటే పురుషులే అధికంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతకంటే మిడిల్ ఏజ్ పురుషులే డేటింగ్ యాప్‌లను అధికంగా వాడేస్తున్నారని, 45 నుంచి 55 ఏండ్లలోపు వారే ఒకరికంటే ఎక్కువ మందితో డేటింగ్ చేస్తున్నారని తేలింది. ఇక యువత 18 నుంచి 40 ఏండ్లలోపు యువత విషయానికి వస్తే ట్రూ హార్ట్ బ్రేక్ అనుభవించిన వారు, పరిస్థితుల కారణంగా ప్రేమ విఫలమైనవారు, విడాకులు పొందినవారు డేటింగ్ యాప్‌ను ఎక్కువగా యూజ్ చేస్తుండగా.. ఇక్కడ కూడా పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రేమను పొందటానికి లేదా ఒకరి సాంగత్యం కోసం డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు.

*గతంలో ఓ డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వే ప్రకారం కూడా యువతకంటే వృద్ధులే వాటిని అధికంగా యూజ్ చేస్తున్నారు. మెట్రో, స్మాలర్ సిటీస్‌కు చెందిన 50 నుంచి 68 ఏండ్ల వయసు గల 6 వేలమందిపై సర్వే చేయగా ఇందులో రిటైర్మెంట్ తర్వాత కొత్త పార్ట్‌నర్ కోసం ఆరాటపడుతున్నవారి సంఖ్యే 67 శాతం ఉంటోందని తేలింది. అందుకే మగాళ్లు మహా రసికులని చమత్కరిస్తు్న్నారు కొందరు. అయితే వినియోగ దారులు నిజమైన ప్రేమను, సంబంధాలను కనుగొనడానికి మాత్రమే డేటింగ్ యాప్‌ నిర్వాహకులు ప్రోత్సహిస్తారు. వాటిని వినియోగించే క్రమంలోనే రకరకాల కారణాలవల్ల మోసాలు జరుగుతుంటాయి. కాబట్టి అలర్ట్‌గా ఉండాలంటున్నారు నిపుణులు.

Next Story

Most Viewed