- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bad Cholesterol : ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్.. మీలో ఆ సమస్య ఉన్నట్టే!

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే మనలో చాలా మంది ‘ఆ.. ఏం అవుతుంది లే..’ అనే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుంటారు. కానీ కొన్నిసార్లు ఇది బెడిసి కొడుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద సమస్యగా మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హెల్త్ విషయంలో లైట్ తీసుకుంటే చివరికి అవస్థలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అనేకమంది హై కొలెస్ట్రాల్ విషయంలో అటువంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల శరీరంలో పేరుకుపోతున్న అధిక కొవ్వు ప్రాణాంతకంగా మారుతోందని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు. ఇంతకీ శరీరంలో హైకొలెస్ట్రాల్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? లక్షణాలేమిటో చూద్దాం.
*శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడమనేది ఇటీవల చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు లక్షణాలు పైకి కనిపించకపోయినా ప్రాబ్లం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఫైనల్లీ ఆర్టెరీ బ్లాక్, రక్తనాళాల్లో సమస్యలు, స్ట్రోక్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు, క్రమంగా గుండె జబ్బులకు దారితీస్తుంది. అయితే శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌లోనూ రెండు రకాలుంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL) కాగా, రెండవది మంచి కొలెస్ట్రాల్ (HDL) శరీరంలో ఎల్‌డీఎల్ ఉందని తెలిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది పెరిగిపోతే లివర్ అండ్ జీర్ణ కోశ సమస్యలు తలెత్తుతాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడంవల్ల చివరకు స్ట్రోక్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.
*బ్యాడ్ కొలెస్ట్రాల్ లక్షణాల విషయానికి వస్తే.. శరీరంలో అధికంగా ఉన్నప్పుడు కళ్లపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. కాళ్లల్లో ముఖ్యంగా పిక్కల్లో, మడమల్లో, మోచేతులపై తరచుగా నొప్పులు పుడుతుంటాయి. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిన అనుభూతి కలుగుతుంది. ఇవి నార్మల్ ప్రాబ్లమ్స్ కదా అని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం సమస్య తీవ్రంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జాగ్రత్త పడాలి. చర్మంపై దద్దుర్లు, పొక్కులు, చెంపలపై కొవ్వు గడ్డలు, మొటిమలు తరచుగా రావడం కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుదలకు సూచనలుగా నిపుణులు పేర్కొంటున్నారు. అట్లనే ఛాతీలో మంట, కడుపులో ఉబ్బరం వంటివి తరచుగా సంభవిస్తుంటే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి ఉండవచ్చు. కళ్లల్లో తెలుపు చారలు ఎక్కువగా పెరగడం కూడా చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి సూచనలుగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిలో ఏ లక్షణాలు కనిపించినా మీ శరీరంలో కొవ్వు శాతం పెరగినట్లు అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.