వేసవిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. డయాబెటిస్ ఉన్నవారైతే ప్రమాదంలో పడ్టట్లే !

by Dishafeatures2 |
వేసవిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. డయాబెటిస్ ఉన్నవారైతే ప్రమాదంలో పడ్టట్లే !
X

దిశ, ఫీచర్స్ : వాతావరణ మార్పులు వ్యక్తుల జీవన విధానంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న సంగతి తెలిసిందే. అలాగే సీజన్‌ల్ వ్యాధులు కూడా వెంటాడుతుంటాయి. ప్రస్తుతం వేసవి కారణంగా రాత్రింబవళ్లు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే డయాబటిస్ పేషెంట్లపై ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని, వారిలో కనిపించే కొన్ని లక్షణాలను ప్రమాదకరంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలవల్ల డయాబెటిస్ బాధితులు సమ్మర్‌లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని, రక్త నాళాలు వ్యాకోచించే రిస్క్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటితోపాటు అంటు వ్యాధులు, ఆకస్మికంగా వెయిట్ లాస్ అవ్వడం, నోటిలో దుర్వాసన, స్కిన్ అలెర్జీలు వంటివి లక్షణాలు మధుమేహం ఉన్నవారిలో వేసవిలో ఎక్కువగా కనిపించే చాన్సెస్ ఉంటాయి.

బ్యాక్టీరియా వ్యాప్తి

డయాబెటిస్ పేషెంట్లలో రక్తం, కణజాలాల్లో షుగర్ లెవల్స్ పెరగడంవల్ల వేసవిలో వేడి వాతావరణానికి బ్యాక్టీరియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడే ఇమ్యూనిటీ పవర్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా కిడ్నీలు, మర్మాంగాలు, కీళ్లు, చిగుళ్లు, పాదాలు వంటి భాగాల్లో ఇన్ఫెక్షన్లు కలుగుతుంటాయి.

అకస్మాత్తుగా రువు తగ్గడం

సాధారణంగా అయితే అధిక బరువు ఉండటం మంచిది. కానీ షుగర్ పేషెంట్లలో మాత్రం ఇది ప్రమాదకర సంకేతం కావచ్చు. ముఖ్యంగా వేసవిలో రోగ నిరోధకశక్తి పడిపోయినందువల్ల ఇలా జరగుతుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే చాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే రక్తంలో తగినంతగా గ్లూకోజ్ రిలీజ్ కాకపోవడంవల్ల ఆకలి మందగిస్తుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు శరీరంలోని కొవ్వు వేగంగా బర్న్ అవుతూ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గే చాన్స్ ఉంటుంది. ఇలాంటప్పుడు వైద్య నిపుణులను సంప్రదించాలి.

స్కిన్ అలెర్జీలు

డయాబెటిస్ బాధితుల్లో ఎండాకాలం చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా స్కిన్ అలెర్జీలతోపాటు చర్మం రంగు మారవచ్చు. కొందరికి మెడ, చంకలు, గజ్జలు, వీపు భాగాల్లో నల్లగా మారుతుంది. ఈ పరిస్థితిని మెడికల్ టెర్మ్‌లో అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో చర్మ సమస్యలు వస్తుంటాయి. కానీ కేవలం డయాబెటిస్ వల్ల మాత్రమే వస్తాయని భావించాల్సిన అవసరం లేదు. అందుకే చర్మం రంగు మారితే టెస్టులు చేయించుకోవడం బెటర్.

ఓరల్ హెల్త్‌పై ప్రభావం

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలవల్ల నోటిలో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. తరచుగా నోరు ఎండిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్త నాళాలు, చిగుళ్లు, శరీరంలోని ఇతర భాగాల్లోకి బ్లడ్ సప్లయ్ తగ్గుతుంది. దీంతో నోటిలో పుండ్లు, ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

నివారణ ఎలా?

డయాబెటిస్ పేషెంట్లు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలవల్ల తలెత్తే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. శరీరానికి చికాకు కలిగించని కాటన్ దుస్తులను ధరించడం బెటర్. అలాగే ధూమపానం, మద్యపానం అలవాటును తగ్గించుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచుకోపోతే, దీర్ఘకాలం పెరగడం కొనసాగుతూ ఉంటే క్రమంగా స్ట్రోక్, గుండెపోటు వంటి ఇష్యూస్ తలెత్తవచ్చు. అందుకే షుగర్ పేషెంట్లు సమ్మర్‌లో కేర్‌ఫుల్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story