- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోరుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి
దిశ, ఫీచర్స్ : చాలామంది ఎదుర్కొనే కామన్ సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి. వర్క్ బర్డెన్స్, ఫ్యామిలీ అండ్ ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్, నిరుద్యోగం వంటి ఇబ్బందులతోపాటు ఒత్తిడిని నియంత్రించే పోషకాల లోపంవల్ల కూడా ఈ మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఫలితంగా మన దేశంలో దాదాపు 89 శాతం మంది స్ట్రెస్‌కు గురవుతున్నట్లు సైకాలజీ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ల అంచనా. అంతేగాక ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు తీవ్రమైన ఒత్తిడితో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మెంటల్ స్ట్రెస్‌ను ప్రారంభ దశలో గుర్తించి దూరం చేసుకోకపోతే క్రమంగా డిప్రెషన్, డయాబెటిస్, అధిక బరువు, అల్జీమర్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రాబ్లం దేనివల్ల కలిగిందో పరిశీలించి, ఆ పరిస్థితిని నివారించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాలి. మెదడులో కార్టిసాల్ హార్మోన్లను నియంత్రించి, చురుకుదనాన్ని పెంచే సెరోటోనిన్, ఎండార్ఫిన్ వంటి హార్మన్లను రిలీజ్ చేయగల ఆహారాలు తీసుకోకపోవడం కూడా మానసిక ఒత్తిడికి, వివిధ రుగ్మతలకు ప్రధాన కారణం. అందుకే సి విటమిన్ లభించే ఆరెంజ్, నిమ్మ, దానిమ్మ, ఇతర సిట్రస్ పండ్లను, ఐరన్ పుష్కలంగా ఉండే తోటకూర, బచ్చలికూర, గోంగూర, పాలకూర వంటి ఆకు కూరలను, సెరోటోనిన్, ఎండార్ఫిన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేసే అరటి పండ్లు, అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటవి ఆహారంలో భాగంగా తప్పకు తీసుకుంటూ ఉండాలి. ఈ విధమైన ఆహారాలు మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో సహాయపడతాయి. స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యే పోషకాలను శరీరానికి అందిస్తాయి.
Read More: మానవ హృదయాల్లోకి చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్.. అధ్యయనంలో వెల్లడి