Chia Seeds: వీటిని అలా వాడితే చాలు.. ఆ విషయంలో సమస్యే ఉండదు!

by Javid Pasha |   ( Updated:2025-02-22 07:33:30.0  )
Chia Seeds: వీటిని అలా వాడితే చాలు.. ఆ విషయంలో సమస్యే ఉండదు!
X

దిశ, ఫీచర్స్ : మీరు అధిక బరువుతో అవస్థలు పడున్నారా? అయితే రెండు మూడు నెలల్లోనే ఐదారు కేజీలు బరువు తగ్గే బెస్ట్ సొల్యూషన్ ఒకటుంది. ఏంటంటే.. చియా గింజలను మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. వీటిలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటంతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అధిక బరువు తగ్గించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఎలా తీసుకోవాలి?

చియా సీడ్స్‌ను వాటర్‌లో నానబెట్టి జీలకర్ర, వాము ఉప్పు లేదా చక్కెర కలిపి తాగవచ్చు. అట్లనే స్మూతీలు, పాలు, పెరుగు, పండ్లు, ఇతర వంటకాల్లోనూ చేర్చవచ్చు అంటున్నారు నిపుణులు. సలాడ్స్‌లో కలిపి వినియోగించవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. చియా సీడ్స్ వాడినంత మాత్రాన వెంటనే బరువు తగ్గుతారనే అపోహలకు పోవద్దు. డైట్ పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ వీటిని వాడితే అధిక బరువు తగ్గే అవకాశం ఎక్కువని మాత్రమే నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి?

చియా సీడ్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఆహారంలో, పానీయాల్లో భాగంగా వాడటంవల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. జీర్ణ క్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సెడెంట్లు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. అట్లనే తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలను కలిగి ఉండటంవల్ల అధిక బరువును తగ్గిస్తాయి. అందుకే ఒబేసిటి పేషెంట్లకు వీటిని సజెష్ చేస్తుంటారు ఫిట్‌నెస్ అండ్ పోషకాహార నిపుణులు. అయితే అధికంగా వాడితే కొన్నిసార్లు అలెర్జీలకు కూడా కారణం అవుతుంటాయి. మీ శరీర తత్వాన్ని బట్టి కూడా చియా సీడ్స్ వాడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. అందుకే వాడే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed