- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
High Stress : అధిక ఒత్తిడే అసలు శత్రువు.. ఒబేసిటీకి అదే కారణం!

దిశ, ఫీచర్స్ : మానసిక ఒత్తిడి పరోక్షంగా పలు రకాల శారీరక అనారోగ్యాలకు కూడా దారితీస్తుందని తెలిసిందే. అయితే ప్రస్తుతం అది ఒబేసిటీ లేదా ఊబకాయం సమస్యకు కూడా కారణం అవుతోందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ‘న్యూట్రీసిస్టమ్’ సర్వే ప్రకారం.. 30 ఏండ్లు పైబడిన 2000 మందిని నిపుణులు పరిశీలించగా.. ఐదేండ్లక్రితంతో పోలిస్తే ప్రస్తుతం 57 శాతం మంది ప్రజలు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో 47 శాతానికిపైగా తాము మెంటల్ స్ట్రెస్ కారణంగానే అధిక బరువు పెరుగుతున్నామని భావిస్తున్నారు.
ఒత్తిడి ఎదుర్కోవడానికి గల కారణాలను విశ్లేషించిన నిపుణులు.. ప్రతీ 10 మందిలో నలుగురు ఇనాక్టివ్ సిట్టింగ్, అతి ఆలోచనల కారణంగా స్ట్రెస్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. మరో 30 శాతం మంది భోజనం సరిగ్గా లేకపోవడం లేదా పోషకాలు లోపించడం కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. కాగా ఆయా సందర్భాల్లో పలువురు ఎదుర్కొంటున్న స్ట్రెస్ వారి సామాజిక జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. 44 శాతం మందిలో వర్క్ అండ్ లైఫ్‌పై ప్రభావం చూపుతోంది. డబ్బు సంపాదించే క్రమంలో 36 శాతం మంది, అలాగే ఉద్యోగం చేసేచోట 34 శాతం మంది తరచుగా స్ట్రెస్‌కు గురవుతున్నారు.
కాగా స్ట్రెస్ వల్ల బరువు పెరుగుతున్నామని భావిస్తున్న ప్రతీ నలుగురిలో ఒకరు నిరంతరం ఆందోళన చెందుతున్నారు. 46 శాతం మంది ఒత్తిడి కారణంగా నిద్రను, 37 శాతం మంది ఏకాగ్రతను కోల్పోతున్నారు. 30 శాతం మందిలో ప్రెజర్ పెరుగుతుండగా, ప్రతీ 10 మందిలో నలుగురు క్రానిక్ స్ట్రెస్‌ను అనుభవిస్తున్నారు. దీంతోపాటు ఒత్తిడివల్ల చాలా మంది సాధారణంకంటే 5 నుంచి 7 కిలలో బరువు పెరుగుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. జీవన శైలిలో మార్పులు, హెల్తీ ఫుడ్ హాబిట్స్, వ్యాయామాలు వంటివి అందుకు సహాయపడతాయి.
నివారణ ఎలా?
అధిక ఒత్తిడిని నివారించడంలో శారీరక శ్రమ, సానుకూల దృక్పథం, విశ్రాంతి వ్యాయామాలు సహాయపడతాయి. ఫిజికల్ యాక్టివిటీస్‌లో భాగంగావాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటి కార్యకలాపాలు మేలు చేస్తాయి. అట్లనే తాయ్ - చి వంటి జపనీస్ వ్యాయామాలు కూడా ఒత్తిడి నివారణగా పనిచేస్తాయి. సమస్యలను మరీ భూతద్దంలో పెట్టి చూడకుండా అన్ని కోణాల్లో విశ్లేషించుకోవడంవల్ల ఒత్తిడి నుంచి బయటపడటం ఈజీ అవుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అందుకు సంబంధించిన ఆలోచనలను డైవర్ట్ చేయడానికి ఇతర అంశాలపై ఫోకస్ చేయవచ్చు. పుస్తకం చదవడం, స్నేహితులతో మాట్లాడటం, ఇతర పనుల్లో నిమగ్నం అవడం వంటివి ఒత్తిడిని డైవర్ట్ చేయడంలో సహాయపడతాయి. అధిక ఒత్తిడిని ఎదుర్కోలేని పరిస్థితి ఉంటే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.