Electric massagers : ఎలక్ట్రిక్ మసాజర్లు వాడుతున్నారా?.. బీ కేర్ ఫుల్!

by Javid Pasha |
Electric massagers : ఎలక్ట్రిక్ మసాజర్లు వాడుతున్నారా?.. బీ కేర్ ఫుల్!
X

దిశ, ఫీచర్స్: అసలే బిజీ లైఫ్ షెడ్యూల్.. క్షణం కూడా తీరికలేని పనులు, ప్రయాణాలు, ఆలోచనలతో చాలామంది అలసటకు గురవుతుంటారు. పొద్దస్తమానం బయట తిరగాల్సిన ఉద్యోగాలు చేసేవారు ఇంటికి తిరిగి వచ్చాక రిలాక్స్ అవ్వాలనుకుంటారు. అయితే ఇటీవల పలువురు తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనానికి, శారీరక అలసటను దూరం చేసుకోవడానికి ఎలక్ట్రిక్ మసాజర్లు వాడుతున్నారు. అయితే వీటిని వాడే విధానం తెలియకపోతే పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నారు.

మసాజర్లలో ఇప్పుడు అనేక రకాలు ఉంటున్నాయి. సులువుగా ఉంటుందని చాలామంది హ్యాండ్ ఎలక్ట్రిక్ మసాజర్ వాడుతుంటారు. ఎందుకంటే దీనితో శరీరంపై ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. బాడీలో ఏ భాగంలో నొప్పిగా ఉంటుందో అక్కడ యూజ్ చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా శరీరం మొత్తానికి ఉపశమనం కలిగించే ఎలక్ట్రిక్ బడీ మసాజర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయట. ప్యాడ్‌లు, కుర్చీలు, గ్యాడ్జెట్స్ రూపంలోనూ ఇవి లభిస్తాయని చెప్తున్నారు.

అలసటను, ఒత్తిడిని దూరం చేయడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్ మసాజర్లను సక్రమంగా వాడకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కండరాలపై వాటిని ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ భాగంలో నల్లగా మారడం, పుండ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు సోకడం వంటివి జరగవచ్చునని పేర్కొంటున్నారు. అలాగే మసాజర్లను శుభ్రమైన ప్లేస్‌లో పెట్టకుండా, తుడవకుండా వాడితే ఫంగల్, బ్యా్క్టీరియల్ ఇన్ఫెక్షన్లకు, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. సో.. బీ కేర్ ఫుల్!

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దీనిని ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story