- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో డెత్ రిస్క్.. 32 రకాల వ్యాధులు కూడా..
దిశ, ఫీచర్స్ : చిప్స్, క్యాండీలు, కేకులు, అతిగా నూనెలో వేయించిన పలు రకాల ఆహార పదార్థాలు తినడం మంచిది కాదని మనకు తెలిసిందే. అయితే తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏంటంటే.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తరచుగా తినడంవల్ల క్యాన్సర్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ సహా 32 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, పైగా ఈ విధమైన అలవాటు ముందస్తు మరణంతో ముడిపడి ఉంటుందని వెల్లడించింది.
జీవన ప్రమాణాలపై ప్రభావం
రోజు రోజుకూ మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఆయా దేశాల్లోని ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్‌ను తినడం వల్ల మానసిక, శ్వాసకోశ, కార్డియో వాస్క్యులర్, జీర్ణాశయాంతర వ్యాధులు వంటివి ఎక్కువగా పెరుగుతున్నట్లు గుర్తించారు.
వ్యాధులు, డెత్ రిస్క్
ముఖ్యంగా కార్డియోస్క్యులర్ వ్యాధులకు సంబంధించిన డెత్ రిస్క్ మిగతా వారితో పోల్చితే, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవారిలో 50 శాతం పెరగుతోందని, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 12 శాతం అధికం అవుతోందని కనుగొన్నారు. అంతేకాకుండా వీరిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం 21 శాతం పెరుగుతోందని చెప్తున్నారు. ఒబెసిటీ, స్లీప్ డిజార్డర్స్, డిప్రెషన్, నాడీ వ్యవస్థలో ఇబ్బందులు, కణితులు వంటివి ఏర్పడడం, లుకేమియా, కొలొరెక్టల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రాంక్రియాటిక్ క్యాన్సర్, క్రోన్స్ డిసీజెస్, రొమ్ము క్యాన్సర్ వంటి దాదాపపు 32 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడానికి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రధాన కారణం అవుతున్నాయని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
అల్ట్రా ప్రాసెస్డ్ అంటే..
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే సహజంగా ఇండ్లల్లో వండిన ఆహారాలకు భిన్నంగా ఉంటాయి. కృత్రిమ పద్ధతుల్లో, మెషిన్లను ఉపయోగించి, వివిధ పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు. ఉదాహరణకు నూనెలో అధికంగా వేయించిన పదార్థాలు, స్నాక్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, చాక్లెట్లు, కేకులు వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. వీటిలో పోషకాలు, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఉండవు. కేవలం రుచి మాత్రమే కలిగి ఉంటాయి. షుగర్, ఫ్యాట్, సాల్ట్ లెవల్స్ అధికంగా ఉంటాయి. ఈ కారణంగా అవి అనారోగ్యాలకు కారణం అవుతాయి.
Read More..