Celebrity Destination : సెలబ్రిటీ డెస్టినేషన్‌గా ఆ దేశం.. కారణం ఇదే!

by Javid Pasha |   ( Updated:2024-12-20 14:07:22.0  )
Celebrity Destination : సెలబ్రిటీ డెస్టినేషన్‌గా ఆ దేశం.. కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా..? మనదేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఎక్కువగా ఓ దేశానికి వెళ్లి వస్తుంటారు. అక్కడ కనీసం ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ అయినా కొనుక్కోవాలని కలలు గంటుంటారు. పైగా అక్కడికెళ్లి గడిపి రావడమంటే తమ హోదాను, గౌరవాన్ని మరింత పెంచుతుందని భావిస్తారు. ఆ దేశం మరేదో కాదు.. దుబాయ్. అసలిది సెలబ్రిటీలను ఆకట్టుకునే డెస్టినేషన్‌గా ఎందుకు మారింది? వారంతా వ్యాపారాలు, ఇన్వెస్ట్ మెంట్స్ వంటివి ఎక్కువగా ఎందుకని అక్కడే చేస్తుంటారు? దానికో ప్రత్యేకత ఉందంటున్నారు నిపుణులు. అదేంటో చూద్దాం.

పెట్టుబడుల కోటగా..

ఫారెన్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేసే భారతీయులకు అత్యంత ఆసక్తికరమైన వరల్డ్ ఫేమస్ డెస్టినేషన్‌‌గా దుబాయ్ ఫేమస్ అయిపోయింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ వంటి ప్రముఖులంతా ఇండియాలో ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ దుబాయ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. అక్కడ తమకంటూ సొంత ఆస్తులు సంపాదిస్తున్నారు. కారణం ఏంటంటే.. దుబాయ్ వాస్తవానికి టూరిస్ట్‌ల ఆదాయంపై ఆధారపడి డెవలప్ అవుతున్న కంట్రీ. పెట్టుబడుల కోటగా మారడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు.

జీరో టాక్స్‌‌, మౌలిక సదుపాయాలు

ప్రపంచ పర్యాటలకును ఆకట్టుకోవడానికి అక్కడి ప్రభుత్వం జీరో ట్యాక్స్‌లు, మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇది ప్రాపర్టీ కొనాలనుకునే వారికి అవకాశంగా మారింది. దీంతో ఏమాత్రం సంపాదన పోగుపడినా దుబాయ్‌లో ఒక ఫ్లాట్ కొనాలనుకునే ప్రముఖులే అధికం. ‘దుబాయ్ అన్ లాక్డ్’ రిపోర్ట్ ప్రకారం.. 2020 నుంచి 2022 వరకు దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేసిన జాబితాలో భారతీయులే ముందుంటున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, డాలీ చాయ్ వాలా వంటి వ్యాపార వేత్తలు కూడా దుబాయ్‌లో ఆఫీసులు, ఇండ్లను కలిగి ఉంటున్నారు. ఇక 2010లో బుర్జ్ ఖలీఫా నిర్మాణం తర్వాత అయితే అక్కడి రియల్ ఎస్టేట్‌ డెవలప్ మెంట్స్ ప్రపంచాన్ని ఆకట్టుకుటున్నాయి.

85 శాతం భారతీయులే!

ఒకప్పుడు భారతీయులకు లండన్, అమెరికాలే అత్యంత ప్రయారిటీ గలదేశాలుగా ఉండేవ. కానీ ఇప్పుడు ఆ జాబితాలో దుబాయ్ ఉందంటున్నారు నిపుణులు. చాలామంది బడా వ్యాపారులు, ప్రముఖులు అక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక 2013 నుంచి 2023 మధ్య దుబాయ్‌లో సెటిలైన్ భారతీయులు సంఖ్య చూస్తే 85 శాతం పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరల్డ్ ఫేమస్ గ్లామరస్ అండ్ సేఫ్టీ దేశంగా, ఉన్నత జీవన ప్రమాణాలకు నిలయంగా ఉండటంతో దుబాయ్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారింది. అదీగాక ఆ దేశం అనుమతించే గోల్డెన్ వీసా దుబాయ్ వెళ్లే వ్యాపారులకు, పెట్టుబడి దారులకు, ప్రముఖులకు 5 నుంచి 10 సంవత్సరాలు ఉండేందుకు అనుమతిస్తుంది. పైగా దీనిని పొందడం, రెన్యువల్ చేసుకోవడం కూడా ఈజీనే. ఇలాంటి కారణాలవల్లే అదిప్పుడు సెలబ్రిటీ డెస్టినేషన్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed