వెయిట్‌ లాస్‌ జర్నీలో ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఆరోగ్యాన్ని ముప్పులో పెట్టినట్లే..!

by Sumithra |
వెయిట్‌ లాస్‌ జర్నీలో ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఆరోగ్యాన్ని ముప్పులో పెట్టినట్లే..!
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. పెరిగిన బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వ్యాయామాలు, రన్నింగ్ లు, జాగింగ్ లు, డైటింగ్ లు ఇలా పడరాని పాట్లు పడుతూ ఉంటారు. సన్నగా, అందంగా కనిపిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరైతే వెంటనే బరువు తగ్గిపోవాలని కడుపుకి చాలీచాలని ఆహారం తింటూ, కఠినంగా డైటింగ్ చేస్తారు. అయితే అలా చేయడం వలన బరువు తగ్గడం పక్కన పెడితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

సరిపడా నిద్ర లేకపోతే..

ఒకప్పటి కాలంలోని వారు పగలంతా కష్టపడి రాత్రిపూట త్వరగా నిద్రంచడం, త్వరగా లేవడంతో వారు ఫిట్ గా ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు అలవాటు పడి మధ్యరాత్రి ఎప్పటికో పడుకుంటున్నారు. అలా చేయడం వలన శరీరంలో హార్మోన్ల స్థాయి అదుపు తప్పి బరువు పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు 7 నుంచి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలని చెబుతున్నారు. అలాగే రాత్రి తిన్నతర్వాత వెంటనే నిద్ర పోయినా బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

క్యాలరీలు కౌంట్‌ చేయవద్దు..

బరువు తగ్గాలనుకునేవారు ఏదైనా ఆహారాన్ని తింటూ ఎంత తింటున్నామో, బరువు పెరిగిపోతామేమో అని కంగారు పడుతుంటారు. అలా ఫుడ్ ని క్రమక్రమంగా తగ్గించేస్తుంటారు. అలా చేయడం ద్వారా శరీరం శక్తిని కోల్పోయి జీవక్రియ రేటు మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట తినరు..

బరువు తగ్గాలనుకునే వారు రాత్రి సమయంలో తినడం మానేస్తారు. ఎంత ఆకలివేస్తున్నా సగంతోనో లేక మొత్తానికి తినకుండా పడుకుంటారు. ఇలా చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా రాత్రిపూట సరిపడా ఆహారం తినడం మంచిదని చెబుతున్నారు.

టేస్టీ భోజనం చేయరు..

బరువు తగ్గాలనుకునేవారు రుచికరమైన భోజనాన్ని అస్సలు తినరట. రుచిగా ఉంటే ఎక్కువ తినేస్తామేమో అని స్కిప్ చేస్తారు. అలా చేసినా ముప్పే అని నిపుణుల అభిప్రాయం.. బరువు తగ్గాలనుకున్నా వారికి నచ్చిన ఆహారాన్ని, సమతుల్య ఆహారాన్ని తినాలని చెబుతున్నారు నిపుణులు. తిన్నతర్వతా మాత్రం ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed