- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా చేసేందుకు మ్యాట్ ను ఎందుకు ఉపయోగించాలో తెలుసా..
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం గడుపుతున్న గజిబిజి జీవితంలో ప్రజలు తమ ఫిట్‌నెస్ పై శ్రద్ధ చూపడం ప్రారంభించారు. దీనికోసం కొంతమంది వ్యాయామం చేసేందుకు జిమ్‌కి వెళితే, మరికొంత మంది ఇంట్లో యోగా చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ వ్యాయామశాలలో వర్కవుట్ చేస్తున్నప్పుడు అనేక రకాల పరికరాలను వినియోగిస్తూ ఉంటారు. అయితే యోగా చేస్తున్నప్పుడు మాత్రం కేవలం యోగా మ్యాట్ మాత్రమే అవసరం. యోగా చేసే వారు కచ్చితంగా ఈ మ్యాట్‌లను ఉపయోగిస్తారు.
అనేక రకాల యోగామ్యాట్ లు మార్కెట్‌లో దండిగానే దొరుకుతున్నాయి. వీటిరి యోగా చేసేవారికోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇతర మ్యాట్ ల నుంచి ఇవి భిన్నంగా ఉంటాయి. అయితే యోగా చేసేటప్పుడు కచ్చితంగా యోగా మ్యాట్ ను ఎందుకు ఉపయోగించాలి అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంది. అలాగే నేల పై కూర్చుని యోగా చేయొచ్చా ? యోగా మ్యాట్ ను కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి ? అనే విషయాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. మరి ఆ సందేహాలు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా చేసేందుకు మ్యాట్ అవసరమా..
యోగా చేసే సమయంలో మ్యాట్‌ను ఉపయోగించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే యోగా మ్యాట్ లేకుండా యోగా చేస్తే గాయాలు అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువే. అంతేకాదు యోగా మ్యాట్ తో వ్యాయామం సులభం అవుతుంది. ముఖ్యంగా వృద్ధులు నేలపై యోగా చేస్తే ఆసనాలు వేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి సరైన యోగా మ్యాట్‌ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి యోగా మ్యాట్ కొనాలి ?
ప్రతిరోజు యోగాసనాలు వేసేవారు మంచి క్వాలిటీ ఉన్న మ్యాట్ ను తీసుకోవాలి. జారుడుగా ఉండే మ్యాట్ ని అస్సలు తీసుకోకూడదు. ఫ్లోర్ పైన మంచి పట్టు ఉండే యోగామ్యాట్‌ని కొనుగోలు చేయాలి. కాస్త మందంగా, మెత్తగా ఉండే మ్యాట్ తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. దాని మందం 1.5 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఈ మ్యాట్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శుభ్రత పై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే రబ్బరు మ్యాట్‌లు త్వరగా వాసన రావడం ప్రారంభిస్తాయి. మ్యాట్ మురికిగా ఉంటే దాని పై ఉండే బ్యాక్టీరియా వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. యోగా చేసిన తర్వాత, చాపను మడతపెట్టి, ఎండలో ఉంచవద్దు. అలా చేయడం వల్ల మ్యాట్ దెబ్బతింటుంది.