ఉగాది రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-03-20 06:15:50.0  )
ఉగాది రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలో తెలుసా?
X

దిశ, వెబ్‌ : ఉగాది పండుగ వచ్చేస్తుంది. చాలా మందికి ఈ పండుగంటే ఇష్టం ఉంటుంది. ఈ పండుగను ఎక్కువగా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో జరుపుకుంటారు. అయితే ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి, ఆలయానికి వెళ్లి పూజ చేసుకొని, పంచాగశ్రవణం వింటుంటారు.

ఇక పండుగలలో ముఖ్యంగా దీపావళి, ఉగాది పండుగ రోజు తలంటు స్నానం చేయాలి అంటారు మన పెద్దవాళ్లు. అయితే ఉగాది పండుగ రోజు తలంటు స్నానం ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మనం రోజూ స్నానం చేసినా, ఉగాది రోజు మాత్రం స్పెషల్‌గా శరీరానికి నూనె రాసుకొని స్నానం చేస్తాం. ఇలా చేయడం వలన వ్యక్తిలో ఆధ్యాత్మిక స్పృహ ఏర్పడుతుంది. అంతే కాకుండా నూనెతో స్నానం చేయడం వలన తేజస్సు పెరగడమే కాకుండా శరీరంలో జీవశక్తి కూడా పెరిగి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారంట. అలాగే నూనె రాసుకున్న చర్మం పై వేడి నీరు పడటం వలన శరీరంపై రక్షణ పొర ఏర్పడుతుంది. ఇది మన చర్మాన్ని కాపాడుతుంది.

Also Read..

సోమవారం శివున్ని ఏ పూలతో పూజిస్తే మంచి జరుగుతుందో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed