ట్రాక్టర్‌కు ముందు చక్రాలు చిన్నగా, వెనుక చక్రాలు పెద్దగా ఎందుకు ఉంటాయో తెలుసా?

by Jakkula Samataha |
ట్రాక్టర్‌కు ముందు చక్రాలు చిన్నగా, వెనుక చక్రాలు పెద్దగా ఎందుకు ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ట్రాక్టర్స్‌ను చూడని వారు ఎవరూ ఉండరు. దుక్కి, పొలం దున్నడానికి, ఏవైనా వస్తువులు లేదా పంటకు సంబంధించిన ధాన్యం తరలించడానికి ట్రాక్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా వ్యవసాయం కోసమే వాడుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ ట్రాక్టర్‌ను సరిగ్గా గమనిస్తే అందులో ఓ తేడా మీకు కనిపిస్తుంటుంది. ఇంతకీ అది ఏమిటి అనుకుంటున్నారా? ట్రాక్టర్ వెనుక టైర్స్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ ముందు ఉన్న టైర్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఇలా ఎందుకు ఉంటాయి. దీనికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాక్టర్ చాలా తేలికగా కదలడానికి, టర్నింగ్ స్పేస్ తక్కువగా ఉన్నా, అవి సులభంగా వెళ్లడానికి ట్రాక్టర్‌కు ముందు ఉన్న చిన్న టైర్లు ఉపయోగపడుతాయంట. అందుకే ట్రాక్టర్‌ను రూపొందించే సమయంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అలా రూపొందించినట్లు సమాచారం. మీరు సరిగ్గా గమనిస్తే ట్రాక్టర్ ముందు టైర్స్ అనేవి కదలవు, స్ట్రీరింగ్ కదిలినప్పుడు మాత్రమే అవి కదులుతుంటాయి. ఎందుకంటే? అవి నేరుగా స్టీరింగ్ కు అనుసంధానం అయి ఉంటాయి. ఇక ట్రాక్టర్స్ అనేవి హ్యాండ్లింగ్, గ్రిప్, బ్యాలెన్స్, చమురు ద్వారా అవి నడుస్తుంటాయి. అలాగే చిన్న టైర్స్ ఇంజిన్ పై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వలన అది తక్కువ ఇంధనం వినియోగిస్తుందంట. అందుకే వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ట్రాక్టర్‌ను రూపొందించారంట. ఇక ముందు ఉన్న ఇంజిన్‌కు సపోర్ట్‌గా ఉండటానికి, బురదలో ఈజీగా కదలడానికి ట్రాక్టర్‌కు వెనుక పెద్ద టైర్స్ అమర్చడం జరిగిందంట.

Advertisement

Next Story

Most Viewed