- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Lorry: లారీలు, ట్రక్కులు వెనుక Horn OK Please అని ఎందుకు రాస్తారో తెలుసా..?

దిశ, వెబ్ డెస్క్ : మనం బయటకు వెళ్ళినప్పుడు కొత్త సింబల్స్, పదాలు, అక్షరాలను చూస్తుంటాము. అయితే, ఇవి ఎలా వచ్చాయో మనకు ఇప్పటికి తెలియదు. కానీ, తెలియకుండా వాడుతూనే ఉన్నాం. మీరు Horn OK Please .. అనే పదాన్ని చాలా సార్లు చూసి ఉంటారు. ఈ అక్షరాలు లారీలు, ట్రక్కులపై ఎక్కువగా కనిపిస్తాయి. అసలు వీటిని ఎందుకు వాడారో ఇప్పటికి వరకు తెలియదు. కానీ, వీటి అర్థాలేంటో ఇక్కడ చూద్దాం..
ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు మొత్తం ఆగిపోతాయి. ఆ సమయంలో ముందుర ఉన్న వెహికల్ ను ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు వెనుక ఉన్న వాహనం హారన్ మోగించాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఇలా పెట్టారు. హారన్ మోగించాక, దాన్ని విన్న ముందు డ్రైవర్ OK అని భావించిన తర్వాత వెనుక డ్రైవర్‌కు ఓవర్ టేక్ చేసేందుకు దారిని ఇస్తాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెహికల్స్ ను కిరోసిన్‌తో నడిపేవారు. దాన్ని సింబాలిక్‌గా చూపడానికి కొన్ని వాహనాలకు వెనుక ఆన్ కిరోసిన్ (On Kerosene) అని రాసేవారు. ఇలా రాయడం వలన వాహనాలను ప్రమాదం జరిగేవి కావట. క్రమంగా ఆది OK గా మారింది. అలా ఆ పదాల మధ్యలో Horn Please అని వచ్చింది
కొన్నేళ్ల క్రిత్రం టాటా ఆయిల్ మిల్స్ లిమిటెడ్ " OK " అనే డిటర్జెంట్‌ను మార్కెట్లో ప్రమోట్ చేసేందుకు ట్రక్కుల వెనుక అలా OK అని రాసేవారట. ఆ తర్వాత Horn Please అనే పదం చేరిందని చెబుతున్నారు. వాహనాల వెనుక Horn OK Please అనే పదాలు చదివితే వెనుక వస్తున్న వాహనాలు దూరంలోనే ఉన్నాయని అర్థం. అందుకే, అలా రాయించడం మొదలు పెట్టారట. Horn OTK (Overtake) అనే వర్డ్స్ Horn OK Please గా మారాయట. Horn OTK (Overtake) అంటే వెనుకున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని క్రాస్ చేసేటప్పుడు హారన్ మోగించాలి అని అర్థం.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.