రాజకీయ నాయకులు ఎక్కువగా తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?

by Jakkula Samataha |
రాజకీయ నాయకులు ఎక్కువగా తెల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేడి తగ్గిపోయింది. కొత్త ప్రభుత్వాలు కూడా కొలువుదీరి తమ పరిపాలన కొనసాగించటానికి కసరత్తు మొదలు పెడుతున్నాయి. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుండైనా సరే ఎక్కువగా తెల్లటి దుస్తులు మాత్రమే ధరిస్తుంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రాజకీయ నాయకులు ఎందుకు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు. దానికి గల అసలు కారణం ఏమిటో? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

మనం టీవీల్లో కనుక చూస్తే ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు నల్లటి వస్త్రాలు ధరిస్తుంటారు. కానీ భారతదేశంలో రాజకీయ నాయకులు మాత్రం తెల్లటి వస్త్రాలు ధరిస్తుంటారు. పీఎం, సీఎం నుంచి, ఊరిలో సర్పంచ్‌ల వరకు ప్రతి ఒక్కరూ ఎక్కువ తెల్లటి దుస్తులనే ధరిస్తారు. అయితే దీనికి ఓ కారణం ఉన్నదంట. తెలుపు రంగుకు ఉన్న అర్థం, ప్రాముఖ్యత కారణంగానే మన దేశంలో రాజకీయ నాయకులు తెల్లని వస్త్రములను ధరిస్తున్నారంటున్నారు కొందరు.

ఎందుకంటే తెలుపు అంటే స్వచ్ఛత, శాంతి అని అర్థం. అందుకోసమే వారు ఈ దుస్తులను ధరిస్తున్నారంట. అంతే కాకుండా భారత స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ విదేశీ వస్త్రాలను తగలబెట్టి మేకిన్ ఇండియా, స్వదేశీ వస్త్రధారణను ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అలాగే మహాత్మా గాంధీ, తన చరఖా తో తానే నేసుకున్న బట్టలను ధరించే వారు అలా భారతీయులు తమ దుస్తులు తామే తయారు చేసుకొని ధరించేవారు. ఇక అప్పుడు పోరాటంలో పాల్గొన్న వారు, విప్లవకారులు అందరూ తెల్లటి వస్త్రాలనే ధరించడంతో అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed