పూర్వీకులు మట్టిపాత్రల్లోనే ఎందుకు వంట చేసుకునేవారో తెలుసా?

by Jakkula Samataha |
పూర్వీకులు మట్టిపాత్రల్లోనే ఎందుకు వంట చేసుకునేవారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మట్టి పాత్రల్లో వంట అనేది చాలా బాగుంటుంది అంటుంటారు మన పెద్దలు. పూర్వకాలంలో అందరూ మట్టిపాత్రల్లోనే వంట చేసుకొని తినేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. మట్టిపాత్రలను వదిలేదసి నాన్ స్టిక్, స్టీల్, సిరామిక్ పాత్రల్లో వంట చేసుకుంటున్నారు. అయితే ఈ పాత్రలకన్నా, మట్టి పాత్రల్లో వంటనే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మట్టి పాత్రలు అన్నిరకాల వంటలకు ఉపయోగించుకోవచ్చునంట. అలాగే డీప్ ఫ్రై, రోస్ట్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అంట. అంతే కాకుండా మట్టిపాత్రల్లో చేసిన వంట తినడం వలన ఆరోగ్యం బాగుంటుందంట, అందుకే పూర్వకాలంలో ఎక్కువగా మట్టిపాత్రలను వంటకు ఉపయోగించేవారు.అంతేకాకుండా మట్టి కుండలో వండిన ఆహారంలో కాల్షియం, ఫాస్పరస్, సల్ఫర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మట్టిపాత్రలో ఉప్పు, కారం, పులుపు చేర్చితే ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. లోహ సంబంధిత ఫలితాలు అంతగా వుండవు. అందువలన ఎలాంటి అనారోగ్యకరమైన సమస్యలు దరిచేరవు. అందువలన ఇప్పటికీ పల్లెటూర్లలో కొంత మంది మట్టి పాత్రల్లోనే వంట చేసుకుంటున్నారు.

Advertisement

Next Story