- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దెయ్యాలు, ఆత్మలు కొంత మందికే ఎందుకు కనిపిస్తాయో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : దెయ్యాలు, ఆత్మల గురించి మాట్లాడుకోవడం చాలా మంది ఇష్టం. కొంత మంది స్పెషల్‌గా హర్రర్ స్టోరీస్‌నే వింటుంటారు. ఇక మనం పల్లె టూర్లలో ఎన్నో కథలు వింటుంటాం..ఆమెకు దెయ్యం పట్టిందని, లేదా వాళ్లకు దెయ్యం కనిపించిది. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత నాకు రోజూ కనిపించేదని, చాలా గాసిప్స్ వినిపిస్తుంటాయి.
అయితే కొంత మంది దెయ్యం ఉందని నమ్మితే, మరికొందరు దెయ్యం లేదు, ఆత్మలు ఏం లేవు అంటుంటారు. కాగా, దీనిపై సామాజిక శాస్త్రవేత్త క్రిప్టోఫర్ మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో దయ్యం ఉండాలంటే ముందుగా ఇంట్లో ఎవరో ఒకరు ఇంట్లో దయ్యం ఉందని నమ్మాలి.’’ అని అన్నారు. మన ఆలోచనలు, అంచనాలు, మన ఇంద్రియ స్పందన వంటివన్నీ కలిసి మన పరిసరాలలో జరిగే విషయాలను రిసీవ్ చేసుకునే విధానం ఆధారపడి ఉంటుంది.
దయ్యాల మీద నమ్మకం ఉన్న వారికి కీచురాళ్ల శబ్దాలు, తలుపుల చప్పుడు వంటివి పారానార్మల్ శక్తుల పనిగా అనిపిస్తే అటువంటి నమ్మకం లేని వారు లాజిక్‌ల కోసం వెతుకుతారు. ఇలా పారానార్మల్ నమ్మకాల వల్లే చాలా మంది దయ్యాలను చూడడం సాధ్యపడుతుంది. పూర్తి జనాభాలో కనీసం 75 శాతం మందిలో కనీసం ఒకరైనా పారానార్మల్ నమ్మకం కలిగి ఉన్నారని, 50 శాతం మందికి వేటి మీద నమ్మకం ఉండదు, కాబట్టి వారికి దెయ్యాలు, ఆత్మలు కనిపించవు అన్నారు.