రాత్రి సమయంలో మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు ఉంచకూడదో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-16 14:36:34.0  )
dead body
X

దిశ, వెబ్‌డెస్క్ : మన హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తికి నియమ నిబంధనల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తాం. అందులో భాగంగానే సూర్యస్తమయం అయిన తర్వాత దహనం చేయరు, ఎందుకంటే స్వర్గద్వారాలు మూసివేయబడుతాయని అంటారు.

ఇక మన పెద్దవారు అంటారు. మృతదేహాన్ని రాత్రి సమయంలో ఒంటరిగా వదిలి వేయకూడదని, అయితే దీని వెనుక గల కారణం ఏంటో చాలా మందికి తెలియదు. కాగా దీనికి సంబంధించిన అసలు నిజం తెలుసుకుందాం.

రాత్రిపూట చాలా దుష్టశక్తులు చురుకుగా ఉంటాయని చెబుతారు. మృతదేహాన్ని ఒంటరిగా ఉంచినప్పుడు, ఈ దుష్టశక్తులు ఆ మృతదేహంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సృష్టిస్తాయంట. అంతేకాకుండా గరుడ పురాణం ప్రకారం, మరణించిన తరువాత, మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ మృతదేహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆత్మకు ఆ శరీరంతో గొప్ప అనుబంధం ఉన్నందున, ఆత్మ మళ్లీ ఆ శరీరంలోకి ప్రవేశించాలని కోరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, అక్కడ ఉన్నవారిని చూడనప్పుడు బాధపడుతుంది. అందుకే మృత దేహాన్ని వదలలేదు.ఈ కారణాల వల్లనే మృతదేహాన్ని రాత్రి సమయంలో ఒంటరిగా ఉంచకూడదంట.

Read More: ఆల్కహాల్ వ్యసనానికి ఇక పర్మినెంట్ సొల్యూషన్.. జెన్ థెరపీని కనుగొన్న పరిశోధకులు

Advertisement

Next Story