- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ శృంగార రహస్యాలను భార్య తన భర్తతో పంచుకోదట.. అవేంటో తెలుసా ?
దిశ, ఫీచర్స్ : దంపతులు శృంగారం చేసే సమయంలో ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. కానీ మహిళలు మాత్రం చాలా వరకు ఏ విషయాలను అంత త్వరగా పంచుకోరట, ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాలను అస్సలు బయటపెట్టరట. అయితే శృంగారాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాధించేందుకు అవసరాలు, ఫాంటసీలు, కోరికలు, ఆశలను పంచుకోవాలని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తుంటారు. కొత్త కొత్త భంగిమల్లో రతిచేయాలన్నా భార్యాభర్తలు మనసువిప్పి చెప్పుకోవాలని చెబుతున్నారు. కానీ మహిళలు శృంగారం విషయంలో చాలావరకు భర్తలతో ఎలాంటి విషయాలను పంచుకోరట. శృంగారం విషయంలో మహిళలు దాచిపెట్టే రహస్యాలు ఏంటో.. రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ జరిపిన ఓ అధ్యయనంలో ఏం వెల్లడైందో తెలుసుకుందాం..
ఇష్టం లేకపోయినా చెప్పరు..
శృంగారం చేసే సమయంలో కొన్ని సార్లు పురుషులు చేసే పనులు స్త్రీలకు అస్సలు నచ్చవట. అయినా ఆ విషయాలను వారు బయటపెట్టకుండా వారిలోనే దాచుకుంటారు. భర్త తనని సంతృప్తి పరచకపోయినా భార్య ఆ విషయాన్ని పంచుకోరట. ఎందుకంటే ఆ విషయంలో మగవారి ఆత్మవిశ్వాసం దెబ్బతిని అపోహలు పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హస్త ప్రయోగం..
స్త్రీలు ఒంటరిగా ఉండి, శృంగార కోరికలు కలిగితే హస్త ప్రయోగం చేసుకుంటారట. కానీ ఈ విషయాన్ని స్త్రీలు తమ భర్త దగ్గర సీక్రెట్ గా ఉంచుతారట.
సెక్స్ డ్రైవ్..
పురుషులతో పోలిస్తే స్త్రీలలో సెక్స్ డ్రైవ్ ఎక్కువగా ఉండడంతో వారు ఎక్కువ సేపు శృంగారం చేయగలరని నిపుణులు చెబుతున్నారు. పురుషులకు అంత సెక్స్ డ్రైవ్ ఉండకపోవడంతో వారు అంతసేపు రతి చేయలేరట. దీంతో భార్యలు అసంతృప్తి చెందినా ఈ విషయాన్ని గురించి భర్తలకు చెప్పరట. చాలా మంది స్త్రీలు ఎక్కువ సేపు తన భాగస్వామితో శృంగారంలో పాల్గొని మంచి అనుభూతులను పొందాలనుకుంటారట.
క్లైమాక్స్ తృప్తి..
స్త్రీలు భావప్రాప్తి చెందడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అయితే పురుషులు మాత్రం స్త్రీలకు సంతృప్తి కలిగిందా లేదా అని ఆలోచించకుండా త్వరగా శృంగారాన్ని ముగించేస్తారట. దీంతో చాలా మంది స్త్రీలు భావప్రాప్తి పొందకపోయినా ఆ విషయాన్ని భర్తలతో పంచుకోరట.