వివాహిత మహిళలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు.. అవేంటో తెలుసా

by Sumithra |
వివాహిత మహిళలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు.. అవేంటో తెలుసా
X

దిశ, ఫీచర్స్ : హిందూమతంలో వివాహిత మహిళలకు అలంకారం ఎంతో ముఖ్యం. శాస్త్రాల ప్రకారం వివాహమైన తర్వాత మహిళలు తమ నుదుటి పై సింధూరాన్ని పెట్టుకుంటారు. పాదాల వేళ్లకు మెట్టెలు ధరిస్తారు. అలాగే మెడలో మంగళసూత్రం ధరించే సంప్రదాయం ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే బొట్టు, పూలు, గాజులు ఇలా ప్రతి ఒక్క అలంకారం స్త్రీల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో ముడిపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

హిందూ గ్రంధాల ప్రకారం నుదుటన సింధూరం మహిళలకు గౌరవాన్ని పెంపొందిస్తుంది. నుదుట సింధూరం వివాహానికి చిహ్నమని నమ్ముతారు. వివాహిత మహిళ నుదుటన సింధూరం పెట్టుకోవడం వల్ల తన భర్త జీవితం సంతోషంగా, దీర్ఘంగా ఉంటుందని చెబుతున్నారు.

మంగళసూత్రానికి ప్రాముఖ్యత..

హిందూ మతంలో మంగళసూత్రం ఎంతో పవిత్రమైనది. దీనిని స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ మంగళసూత్రాన్ని నల్లపూసలతో, అలాగే పసుపు దారంలో దారంతో తయారు చేస్తారు. పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఇది ఎల్లప్పుడూ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందిస్తుంది. వివాహిత స్త్రీని ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి నల్లపూసలు పనిచేస్తాయి.

సింధూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత..

హిందూ మతంలో సింధూరాన్ని కూడా స్త్రీ సౌభాగ్యంగా సూచిస్తారు. మతవిశ్వాసాల ప్రకారం వివాహిత స్త్రీలు ఎరుపు రంగు బొట్టు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే మట్టి గాజులు ధరించడం కూడా సౌభాగ్యంగా చెబుతారు. ఇక పెళ్లయిన మహిళలు నల్లటి గాజులు ధరించడం మానుకోవాలని చెబుతారు. మంగళవారం, శనివారం గాజులు కొనకూడదని గుర్తుంచుకోండి.

Advertisement

Next Story

Most Viewed