క్యూఆర్ కోడ్‌లో ఏం ఉంటుందో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |
క్యూఆర్ కోడ్‌లో ఏం ఉంటుందో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: భారతదేశం డిజిటల్ యుగం వైపు దూసుకెళ్తుంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే, ఈ చెల్లింపులు చేసే వారిలో ఎక్కువగా భారతదేశం వారే ఉన్నారు. డిజిటల్ చెల్లింపులో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సహాయంతో ఎవరికైనా ఈజీగా నగదును చెల్లించవచ్చు. ప్రతి రోజూ కొన్ని కోట్ల మంది దీని ద్వారా నగదు చెల్లింపులు చేస్తున్నారు. అసలు ఈ క్యూఆర్ కోడ్‌ల్‌లో ఏముంటుంది? ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్‌లో 1994వ సంవత్సరంలో మసాహికో హరా అభివృద్ధి చేశారు. ఇందులో చిన్న చిన్న నల్లటి బాక్సులు ఉంటాయి. వాటిని మాడ్యుల్స్ అని అంటారు. అందులో డేటా అనేది స్టోర్ అవుతుంది. సాధారణంగా ఇది 2 డైమెన్షన్‌లో ఉంటుంది. రీడబుల్ ఆప్టికల్ లేబుల్‌లో యూఆర్‌ఎల్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందుపరచవచ్చు దానిని స్కాన్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ప్రపంచ దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు.

ఈ క్యూఆర్ కోడ్‌లో మూడు పెద్ద బ్యాక్సులు ఉంటాయి. ఇవి క్యూఆర్ కోడ్‌ను పొజిషన్‌లో ఉంచడానికి సహాయపడతాయి. క్యూఆర్ కోడ్‌లోని అలైన్‌మెంట్ ప్యాటర్న్, టైమింగ్ ప్యాటర్న్ అందులోని డేటా ఏంటి, దానిని ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది. అయితే, ఈ కోడ్‌లోని 30 శాతం భాగం కనిపించకపోయినా, చెరిగిపోయినా అందులోని డేటాను మాత్రం తెలుసుకోవచ్చు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed