ప్రతి రోజూ స్నానం చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసా?

by Disha Web Desk 8 |
ప్రతి రోజూ స్నానం చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : రోజూ స్నానం చేయని వారు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా వరకు ప్రతి ఒక్కరూ రోజూ ఉదయం స్నానం చేస్తుంటారు. ఇంకొంత మంది రోజుకు రెండు సార్లు కూడా స్నానం చేస్తారు. కానీ చైనాలో మాత్రం వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తారంట. అయితే చాలా మందిలో ఒ ప్రశ్న మెదులుతుంటుంది. అది ఏమిటంటే రోజూ స్నానం చేయాలా? ఇలా రోజూ స్నానం చేయడం వలన మంచిదేనా? అనే డౌట్స్ మొదలవుతుంటాయి.

అయితే ఓ నివేదికలో, పర్యావరణవేత్త డోనాచాద్ మెక్‌కార్తీ ప్రతిరోజూ స్నానం చేయడం ఒక సామాజిక ఆచారం మాత్రమే అని చెప్పారు. స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన తొలగిపోతుందనే నమ్మకం సమాజంలో ఉంది. కానీ ఇందులో వాస్తవం లేదని తెలిపారు. భారత దేశంలో చాలా మంది ప్రతి రోజూ స్నానం చేస్తారు. ఇలా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు అనేది అవాస్తవం. ప్రతీ రోజూ స్నానం చేయడం వలన మన చర్మంలో ఉండే మిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులు తొలిగిపోతాయంట. ఇది మనకు హాని చేస్తుంది అంటున్నారు నిపుణులు. దీని వలన దురద, పొడి చర్మం లాంటి సమస్యలు ఎదురవుతాయంట.

భారతదేశం వంటి దేశాల్లో, దుమ్ము కాలుష్యం చాలా ఎక్కువ. దుమ్ము కాలుష్యం చర్మానికి ఎక్కువగా అంటుకుంటే, అది హానికరం. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జోసీ పార్క్ న్యూయార్క్ టైమ్స్‌లో మాట్లాడుతూ, మీరు ఎంత తరచుగా స్నానం చేస్తారు అనేది మీ శరీరం చెమటపై ఆధార పడి ఉంటుంది, దుమ్ము, కాలుష్యం అతిగా ఉంటేస్నానం చేయడం కూడా తప్పనిసరి అన్నారు.

Read More...

Health: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే



Next Story

Most Viewed