- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోనాల పండుగ వెనుకున్న రహస్యాలు ఇవే.. పండుగను ఎందుకు జరుపుతారో తెలుసా?
దిశ, ఫీచర్స్ : హైదరబాద్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఆషాఢ మాసం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆషాఢంలో బోనాల పండుగ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరినీ ఈ పండుగ ఏకం చేస్తుంది. మహిళలందరూ పసుపు, కుంకుమ, బోనాలు, పట్టు చీరలతో అమ్మవార్లను కొలుచుకుంటారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఈ పండుగను జరుపుతారు. అయితే బోనాల పండుగ గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోనాల పండుగ జరగడం వెనుక రెండు కీలక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే?1908లో మూసీ వరదలతో హైదరాబాద్ అతలాకుతలం అయ్యిందంట. అప్పుడు అప్పటి మహారాజు కిషన్ ప్రసాద్, మూసీ నది ఉప్పొంగడం తగ్గితే లాల్ దర్వాజా అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో ఘనంగా పూజలు జరిపిస్తా అని మొక్కుకున్నారంట. దీంతో మూసీ ఉప్పొంగడం తగ్గి లాల్ ద్వర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితిగా వచ్చిందంట. అలాగే 1869లో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధి విజృంభన విపరీతంగా ఉండేంది. దీంతో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధి తగ్గితే ఉజ్జెయినీ మహాంకాళి అమ్మవారికి గుడి కట్టిస్తానని, జవాన్లు మొక్కుకున్నారంట. ప్లేగ్ వ్యాధి తగ్గడంతో అమ్మవారికి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరిపించారు. అప్పటి నుంచి ఇలా ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవార్లకు బోనాల ఉత్సవాలు జరిపిస్తున్నారంట. ( నోట్ : పై వార్త ఇంటర్నెట్, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)