Milk : పాలు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?

by Jakkula Samataha |
Milk : పాలు తాగడానికి సరైన సమయం ఏదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : కొంతమంది ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. ఎలాగంటే ఏ టైం లో ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది అనే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మరికొంత మంది తమకు ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తింటుంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతుననాయి. ఎటునుంచి ఏ వ్యాధి ఎలా దాడి చేస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అసలు విషయంలోకి వెళితే..చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం..పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని. పాలలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు, ఖనిజాలు, కాల్షియం, కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. పాలను రోజు తీసుకోవడం వల్ల మన కండరాలు బలంగా ఉంటాయి. కొంతమంది రాత్రిపుటా పాలు తాగడానికి ఇష్టపడతారు. మరికొందరైతే మార్నింగ్, లేదా పరిగడుపున పాలు తాగుతారు. ఈ క్రమంలో చాలా మందికి పాలను పరిగడుపు తాగొచ్చా? లేదా? అసలు రాత్రి సమయంలో తాగితే ఏం అవుతుంది అని పలు సందేహాలు వస్తుంటాయి. ఈ రెండు అలవాట్లలో ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే ఇది చదవండి.

పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. చాలా మంది ఉదయాన్నే పాలను తాగుతుంటారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదయాన్నే పాలు తాగడం వలన కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడుతాయి. మరీ ముఖ్యంగా, పరగడపున అస్సలే పాలు తాగకూడదు. దీని వలన ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు ఎదురు అవుతాయి. అందు వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పాలు తాగడం మంచిదంట. అంతే కాకుండా రాత్రి పడుకునే సమయంలో కూడా పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

Advertisement

Next Story

Most Viewed