కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు తెలుసా..? వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?

by sudharani |   ( Updated:2023-05-28 09:50:10.0  )
కల్లుకు, నీరాకు మధ్య గల తేడాలు తెలుసా..? వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మందికి నీరాకు, కల్లుకు మధ్య వ్యాత్యాసం తెలియదు. నీరాను సూర్యోదయానికి ముందే తీస్తారు. కాబట్టి ఇందులో ఉండే సహాజ గుణాలైన చక్కెరలు అలాగే ఉంటాయి. కొబ్బరి, ఖర్జూరం, జీలుగు, తాటి, ఈత చెట్లు స్రవించే సిద్ధమైన ద్రవం నీరా. కానీ, కల్లు అలా కాదు. కల్లులో ఆల్కహాల్ ఉంటుంది. వీటిని ఎండ వచ్చిన తర్వాత తీస్తారు. ఇది ఉష్ణోగ్రతలు పెరిగి పులిసిపోవడంతో కల్లుగా మారుతుంది.దానిని తాగినప్పుడు మత్తుగా ఉంటుంది. అందుకే కల్లును చాలా తక్కువ మంది ఇష్టపడతారు. అయితే నీరా చాలా మంచింది. ఇందులో ఎటువంటి మత్తు పదార్థం ఉండదు. ఇది సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లలా ఉంటుంది. నీరాను ఎవరైనా తాగొచ్చు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

* నీరాను తీసుకోవడం వల్ల కామెర్లు, టైఫాయిడ్, విరేచనాలు, వాంతులవంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

* ఎముకల పటుత్వం పెంచడంతో వృద్ధుల్లో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

* శ్వాస సమస్యలను తగ్గించడంతోపాటు షుగర్‌ను నియంత్రణలో ఉంచుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతోంది.

* రక్తపోటు, గ్యాస్, మలబద్దకం, అజీర్తి అంటివన్నీ తగ్గించి.. వ్యాధి నిరోదక శక్తిని పెంచుతోంది.

* అంతే కాకుండా దీన్ని షుగర్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.

కాగా.. తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీరంలో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాలు శ్రమించి రూ.20 కోట్లతో దీన్ని నిర్మించారు. నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది.

Also Read..

రోజుకు ఒక్క జామకాయ తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed