ఫ్రిజ్‌లో పెట్టిన ఫుడ్ ను తింటున్నారా.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?

by srinivas |   ( Updated:2023-04-04 10:25:38.0  )
ఫ్రిజ్‌లో పెట్టిన ఫుడ్ ను తింటున్నారా.. ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆహార పదార్థాలు మిగిలిపోయినప్పుడు వాటిని ఫ్రిజ్‌లో పెట్టి.. మరుసటి రోజు తినేవారు చాలా మంది ఉంటారు కదా.. కొంతమంది అయితే 2,3 రోజుల పాటు కూడా తింటుంటారు. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫుడ్ ఎక్కువ సేపు చెడిపోకుండా ఉంటుందని ఇలా చేస్తారు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలేంటో చుద్దామా..

బాక్టీరియా...

ఫ్రిజ్‌లో అన్ని ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఫ్రిజ్ నిండిపోతుంది. దీంతో గాలి వెళ్లే అవకాశం ఉండదు. ఇది ఆహారంలో ఎన్నో రకాల బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ సేపు నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా కూడా తయారవుతుంది. ఇది శరీరంలో ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తుంది. అలాగే ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్ట కూడా పాడు అయ్యే ఛాన్సేస్ ఉన్నాయి.

ఇన్ఫక్షన్...

ప్రస్తుత రోజుల్లో అందరి ఇంట్లో ఫ్రిజ్‌లు ఉంటున్నాయి. కానీ శుభ్రం చేసే తీరిక ఎవ్వరికి ఉండట్లేదు. దీనివల్ల ఫ్రిజ్ లో దోమలు, కీటకాలు పెరగడం మొదలవుతుంది. ఈ కీటకాలు ఆహారంపై వాలడం వల్ల ఎన్నో రకాల బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ విషయం మనం గ్రహించక అలాగే తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.

ఫుడ్ పాయిజనింగ్...

తడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం ఉంచడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ముడి మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేస్తే దాని రసం వేరే ఆహార పదార్థాల్లో పడుతుంది. ఇది దానిలో బ్యా్క్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇలాంటి ఫుడ్ ను తినడం వల్ల కడుపు సంక్రమణ ప్రమాదం ఎక్కువవుతుంది. అలాగే ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కూడా దారితీస్తుంది.

బలహీనత..

ఆహారాన్ని ఎక్కువ సమయం పాటు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల దీనిలో పోషకాలన్నీ తొలగిపోతాయి. పోషకాలు లేనటువంటి ఫుడ్ ని తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్లు, ఖనిజాలు తొలగిపోతాయి. దీంతో మీ కండరాలు బలహీనంగా మారే ప్రమాదం ఉంది.

ఆహార పదార్థాలను ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉండకూడదని, ఆహారాన్ని ఉడికించి తాజాగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఎప్పుడో వండిన ఆహారాన్ని తింటే శరీరం బద్ధకంగా, సోమరిగా మారుతుందని, అప్పుడే వండిన ఆహారం తీసుకోవడం వల్ల చురుగ్గా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Read more:

పిల్లల్లో డయాబెటిస్

పిల్లల్లో అరుదైన వ్యాధులు

Advertisement

Next Story

Most Viewed