కుడి, ఎడమ.. ఏ కాలికి నల్ల దారం కడితే ఏం ప్రయోజనమో తెలుసా.. పండితులు చెప్పేది ఇదే..?

by Disha Web Desk 7 |
కుడి, ఎడమ.. ఏ కాలికి నల్ల దారం కడితే ఏం ప్రయోజనమో తెలుసా.. పండితులు చెప్పేది ఇదే..?
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో ఎవరి కాలకు లేదా చేతికి చూసిన నల్ల దారం కనిపిస్తుంది. కొంత మంది నమ్మకంతో కట్టుకుంటే మరికొందరు ఫ్యాషన్ కోసం కట్టుకుంటున్నారు. ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ నల్ల దారాన్ని ధరిస్తారు. అయితే.. ఏ రకంగా కట్టుకున్నా.. ఎవరు కట్టుకున్నా నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పండితులు. అంతే కాకుండా కుడి, ఎడమ ఏ కాలికి కట్టుకుంటే ఏం లాభామో కూడా చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలికి నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ పండితులు. సాధారణంగా చాలా మంది శని దోష ప్రభావం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి నల్ల దారం కట్టుకుంటే శని దోషం తగలదు. ఈ దోషం నుంచి విముక్తి కలగాలంటే శనివారం రోజు కాలికి నల్ల దారం కట్టుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు. రాహు, కేతువుల బాధలు కూడా ఉండవు. ఏవైనా చెడు గ్రహాలు మీ ఇంట్లో ప్రవహించి మీకు ఆటంకం కలిగించవచ్చు. అలాంటప్పుడు మీరు ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే రాహు, కేతువుల ఆగ్రహం నుంచి బయటపడవచ్చరి తెలిపారు.

ఈ క్రమంలోనే కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. డబ్బు సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇంటికి మంచిని కలిగిస్తుంది. అలాగే ఎవరైన మిమ్మల్ని చూసి అసూయ పడితే నరదృష్టి తలుగుతుంది. అలాంటప్పుడు కూడా నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిది. నర దృష్టికి నివారణగా పని చేస్తుంది ఈ నల్లదారం. అయితే.. ఈ నల్ల దారాన్ని కనిపించకుండా దాచుకోవాలని చెబుతున్నారు పండితులు.

Next Story

Most Viewed