- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
E171 ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : మార్కెట్‌లో చాలా రుచికరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వల్ల ఆరోగ్యానికి అసంఖ్యాకమైన ప్రతికూలతలు ఉన్నాయి. ఇక్కడ మనం టైటానియం డయాక్సైడ్ గురించి మాట్లాడుతున్నాము. ఇది పిల్లలు, పెద్దలు తెలియకుండానే వినియోగిస్తున్న రసాయనం. అయితే ఇది మానవాలిని ఏ విధంగా అనారోగ్యానికి గురి చేస్తుందో ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్లో పాయిజన్ లాగా ఇది శరీరంలోని భాగాల పై దాడిచేస్తుంది. దీంతో ఎప్పుడు తీవ్రమైన వ్యాధికి గురవుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. మీరు కూడా ఇలాంటివి వినియోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తంగా ఉండాలి.
అమెరికన్ వైద్యుల తెలిపిన నివేదికల ప్రకారం టైటానియం డయాక్సైడ్ అనేక ఆహార పదార్థాలలో కనిపిస్తుంది. దీనిని E171 అని కూడా అంటారు. టైటానియం డయాక్సైడ్ అనేది ఒక అకర్బన సమ్మేళనం. ఇది తీసుకున్నప్పుడు, దీని వాసన పీల్చినప్పుడు శరీరానికి హానికలిగిస్తుందని చెబుతున్నారు.
E171 అంటే ఏమిటి ?
E171 టైటానియం డయాక్సైడ్ కణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. ఇది పెయింట్ నుంచి సౌందర్య సాధనాలు, కాగితం ఉత్పత్తి, తెల్లగా ఉండే ఆహార ఉత్పత్తుల వరకు ప్రతిదానిలో ఉపయోగిస్తారు.
ముఖ్యంగా క్యాండీలు, పేస్ట్రీలు, చూయింగ్ గమ్, కాఫీ క్రీమర్లు, చాక్లెట్, కేకులు (అలంకరణ కోసం), పొడి చక్కెర, ఆహార పదార్ధాలలో కనిపిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక భాగాల పై చెడు ప్రభావం ఉంటుంది.
గట్, మెదడు ఆరోగ్యానికి నష్టం..
టైటానియం డయాక్సైడ్ ఆహార పదార్థాలకు తెలుపు రంగును పెంచడానికి ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుకు అనేక రకాలుగా హాని కలుగుతుంది. అంతే కాదు ఇది తీవ్రమైన పేగు సమస్యలను కూడా కలిగిస్తుంది. టైటానియం డయాక్సైడ్‌కు పోషక విలువలు ఉండనందునే దీన్ని ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించరు. E171తో లేబుల్ చేసిన ఆహార పదార్థాలు, అన్ని ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి
అలెర్జీ ప్రతిచర్యకు కారణం కావచ్చు..
టైటానియం డయాక్సైడ్ నుండి అలెర్జీ ప్రతిచర్య ప్రమాదం కూడా ఉంది. దీని వల్ల శరీరంలో దురద, దద్దుర్లు, వాపులు మొదలైనవి ఏర్పడవచ్చు. ఈ సమస్య కూడా తీవ్ర రూపం దాల్చవచ్చు.
క్యాన్సర్ కు అవకాశం..
టైటానియం డయాక్సైడ్‌తో అలెర్జీ అయినట్లయితే దాని లక్షణాలు మీ శరీరంలోని అనేక భాగాలలో కనిపించడం ప్రారంభిస్తాయి. ముఖం, మెడ, చేతులు, కాళ్లు, వీపు, కడుపు పై దద్దుర్లు కనిపిస్తాయి. ఇవి తీవ్రమైన దురదతో పాటు కాలక్రమేణా గాయాలుగా మారవచ్చు. క్యాన్సర్ రూపంలో కూడా మారవచ్చు.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.