అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజుకు ఎన్ని అరటి పండ్లు తినాలో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-18 05:53:29.0  )
అధిక రక్తపోటుతో బాధపడే వారు రోజుకు ఎన్ని అరటి పండ్లు తినాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు భారీన పడుతున్నారు. రక్తపోటు ఎక్కువగా ఉండి నిర్లక్ష్యం చేయడం వలన గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందంట. అయితే అధిక రక్తపోటు అదుపులో ఉండటానికి రోజూ అరటిపండు తినడం చాలా మంచిదటున్నారు ఆరోగ్యనిపుణులు.

అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ అరటి పండు తినడం వలన గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువలన దీన్ని అధికంగా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటు తగ్గుతుందంట.

ఇక ఏదైనా ఆహారాన్ని నిర్దిష్ట పరిమాణంలో తీసుకోవాలని మనందరికీ తెలుసు. అధిక వినియోగం మంచికి బదులుగా హాని కలిగిస్తుంది. అధ్యయనం ప్రకారం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి, మీరు రోజుకు రెండు అరటిపండ్లు మాత్రమే తినాలి. దీని వల్ల రక్తపోటు 10 శాతం వరకు తగ్గుతుంది.

Readd More: అలర్జీ ఉన్న వారు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

Advertisement

Next Story

Most Viewed