శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడితే జరిగేదదే !

by Hamsa |   ( Updated:2023-03-17 07:26:48.0  )
శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడితే జరిగేదదే !
X

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు, విటమిన్లతోపాటు ప్రోటీన్లు చాలా ముఖ్యం. ఇది లోపిస్తే అనేక సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో లైంగిక వాంఛలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. చాలా మంది మహిళలు తమలో సెక్స్ కోరికలు తగ్గుతున్నాయంటే మెనోపాజ్ దశ ప్రారంభమైందని భావిస్తుంటారు. ఒత్తిడితో కూడిన పని, టెన్షన్స్ కూడా లిబిడో తగ్గడానికి, లైంగిక కోరికలు తగ్గడానికి కారణం అవుతుంటాయని కూడా చెప్తుంటారు. ఇవేగాక సెక్స్ డ్రైవ్ తగ్గడానికి చాలా కారణాలున్నాయి. అలాంటి వాటిలో ప్రోటీన్ లోపం ఒకటి.

అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం ప్రకారం.. యుక్తవయస్సులోని మహిళలకు రోజుకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. ప్రతిరోజూ ఆహారంలో భాగంగా ఇది లభిస్తుంది. అయితే రోజూ 15 గ్రాములకంటే తక్కువ ప్రోటీన్ అందుతూ ఉంటే మాత్రం సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సెక్స్ సామర్థ్యం తగ్గడం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. టెస్టోస్టెరాన్ లెవల్స్ కూడా తగ్గుతాయి.

అమైనో ఆమ్లాలు

సాధారణ మహిళలతోపాటు గర్భిణులకు కూడా ప్రోటీన్స్ చాలా అవసరం. వీటిలోపంవల్ల కండరాల బలహీనత సంభవిస్తుంది. రెడ్ బ్లడ్‌సెల్స్ తగ్గి ఎముకలు దెబ్బతింటాయి. క్రమంగా తక్కువ లిబిడో సమస్య తలెత్తుతుంది. వాస్తవానికి ప్రోటీన్స్ కలిగిన ఆహారంలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బాడీలో బ్లడ్ సర్క్యూట్‌ను మెరుగు పరుస్తాయి. సెక్స్ సామర్థ్యాన్ని పెంచి, లైంగిక జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. చికెన్, గుడ్లు, పప్పుధాన్యాలు, బీన్స్ వంటివితింటూ ఉంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందడంతోపాటు లిబిడో పెరుగుతుంది.

క్వినోవా, మొక్కజొన్న

నిపుణుల ప్రకారం.. మొక్క ఆధారిత సూపర్ ఫుడ్ క్వినోవాలో ప్రోటీన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి అవసరమైన 11 అమైనో ఆమ్లాలను ఇది కలిగి ఉంటుంది. అంతేగాక ఫైబర్, ఫోలేట్, రాగి, ఇనుము, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు వండిన క్వినోవాను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ప్రోటీన్ లోపం సమస్య తలెతత్తదు. అలాగే మొక్క జొన్నలో కూడా ప్రోటీన్ పర్సెంటేజ్ విరివిగా ఉంటుంది. ఫైబర్, కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. ఒక కాల్చిన మొక్కజొన్నలో 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి తినడంవల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.

సాల్మన్ చేపలు, గుడ్లు

ఇక ప్రోటీన్లు లభించే మరో ఆహారం సాల్మన్ చేపలు, ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండుసార్లు సాల్మన్‌ను డైట్‌లో చేర్చుకుంటే ప్రోటీన్ లోపం సమస్య పారిపోతుంది. రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. అలాగే గుడ్లలో కూడా ప్రోటీన్ స్థాయి అధికంగా ఉంటుంది. 2 గుడ్లు తింటే 12 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందట. కండరాల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రోటీన్ లోపం ఉన్నవారు గుడ్డులోని పచ్చసొనతో పాటు గుడ్డు మొతాన్ని తినడం బెటర్. ఈ విధమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే గుణం ప్రోటీన్లలో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed