- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్లాస్ ఫ్రాగ్స్.. ట్రాన్స్‌పరెంట్‌గా ఎలా మారుతున్నాయో తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఉష్ణమండల ప్రాంతాల్లో నివసించే గ్లాస్ ఫ్రాగ్(గాజు కప్ప) ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులపై నిద్రిస్తూ రోజులు గడుపుతుంది. అయితే తనకు శత్రువుల నుంచి ప్రమాదం ఉందనే సందేహం కలిగినప్పుడు పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా మారుతుంది. ఈ విషయం దశాబ్దాలుగా తెలిసిందే కానీ ఇదెలా సాధ్యమన్న విషయాన్ని తాజాగా వివరించారు శాస్త్రవేత్తలు. శరీరంలోని రక్తాన్ని ఒకే దగ్గరికి తీసుకురావడం(పూల్ బ్లడ్) ద్వారా ఇలా చేయగలదని నిర్ధారించారు. సాధారణంగా మానవుల్లో ప్రవహించే బ్లడ్ క్లాట్ అయితే సీరియస్ కండిషన్ ఏర్పడుతుంది. కానీ కొన్ని జంతువులు తమ బ్లడ్‌ను పూల్ చేసే సామర్థ్యం మూలంగా తమను తాము రక్షించుకుంటాయని తెలిపారు.
మాంసాహారుల దృష్టిని మరలించేందుకు ఈ జీవి ఆకుపై మారువేషంలో 61% వరకు పారదర్శకంగా మారుతుంది. ఈ 'సూపర్ పవర్'.. వివిధ దశలలో కాంతి యొక్క వివిధ తరంగదైర్ఘ్యాలను ప్రకాశింపజేయగల సామర్థ్యం నుంచి వస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఎర్ర రక్తకణాలను కాలేయంలో ప్యాక్ చేయడం ద్వారా ప్లాస్మా నుంచి రిమూవ్ చేయబడతాయని, అయినప్పటికీ ప్లాస్మాను సర్క్యులేట్ చేస్తాయని తెలిపారు. మొత్తానికి తమ కాలేయంలోకి రక్తాన్ని చేరవేసే గ్లాస్ ఫ్రాగ్స్.. భారీగా రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తపడతాయన్నారు.
రక్త కణాలు దాదాపు 89 శాతం వరకు ప్యాక్ చేయబడటం ద్వారా కాలేయం పరిమాణం దాదాపు రెట్టింపు అవుతుంది. కప్ప పారదర్శకంగా మారడానికి అనుమతిస్తుంది. రాత్రి సమయంలో వేటాడాలని లేదా జతకట్టాలని అనుకున్నప్పుడు..ఎర్ర రక్త కణాలను తిరిగి ప్రసరణలోకి విడుదల చేస్తుంది. దీంతో కాలేయం పరిమాణం మళ్లీ తగ్గిపోతుంది. కాగా ఈ పరిశోధనలు మానవులలో బ్లడ్ క్లాటింగ్ గురించి తెలుసుకునేందుకు మరింత హెల్ప్ అవుతాయని తెలిపారు సైంటిస్టులు.
Read more: