ఈ చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండి..!

by Anjali |   ( Updated:2023-04-21 16:39:34.0  )
ఈ చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండి..!
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లల నుంచి పెద్దల వరకు సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో నోటి పూత ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల తీవ్రమైన నొప్పి, బాధ ఎంతగానో ఉంటుంది. నోటి పూతి కారణంగా ఏం తినాలన్నా కూడా, తాగాలన్నా, చివరకు మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని మౌత్ అల్సర్ అని కూడా అంటారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో మీ నోటిపూతకు చెక్ పెట్టొచ్చు. అవి ఏంటో తెలుసుకుందామా..

* నోటిపూతను అతి తక్కువ సమయంలో నివారించాలంటే.. 4,5 తులసి ఆకులను తీసుకొని నీటిలో శుభ్రంగా నోట్లో వేసుకుని నమిలి మింగాలి. అనంతరం ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిని తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే ఈ సమస్యను ఈజీగా తరిమికొట్టవచ్చు.

* అలాగే ఒక బౌల్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా కలపండి. దీన్ని నోటి పూత ఉన్న చోట్ల అప్లై చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే నోటిపూత నుంచి తొందరగా విముక్తి పొందుతారు.

* ఈ సమస్యను నుంచి బయటపడేందుకు కొబ్బరి నూనె అద్భుతంగా మేలు చేస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని కనీసం 5 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మేయాలి. ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. నోటి పూతకు చెక్ పెట్టొచ్చు.

* అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మసాలా పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల నోటిపూతకు నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి:

వేసవిలో పొడి దగ్గు వేధిస్తోందా? అయితే కారణం ఇదే!

తెల్ల జుట్టు ఎందుకొస్తుందో తెలుసా..? ఇదిగో నివారణ మార్గం

Advertisement

Next Story

Most Viewed