చాణక్యనీతి : ఈ తప్పు చేశారో.. జీవితం నాశనం అయినట్టే?

by Jakkula Samataha |
చాణక్యనీతి : ఈ తప్పు చేశారో.. జీవితం నాశనం అయినట్టే?
X

దిశ, ఫీచర్స్ :విజయం సాధించాలని అందరికీ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకుంటారు. మరికొంత మంది తమకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన విజయాన్ని అందుకోలేరు. అలాంటి వారి కోసం ఆచార్య చాణ్యక్యుడు కొన్ని విషయాలు తెలియజేశాడు.

ఆచార్యచాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు అనే అంశాలను స్పష్టంగా వివరించాడు. అయితే వ్యక్తి చేసే ఒక తప్పు తమ జీవితాన్ని నాశనం చేస్తుంది. అది ఏమిటంటే? మనసుపై నియంత్రణ లేకపోవడం.

మనసుపై నియంత్రణ లేకపోతే ఏ పని చేయలేరంట. అలాంటి వ్యక్తి ఎన్ని తెలివితేటలు ఉన్నా అవి వృధా అవుతాయంట. తన మనస్సును స్థిరపరచుకోలేకపోవడం వల్ల తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతారు. ఏ పని చేసినా.. ఫలితం ఉండదు. ఇది అతని కాళ్లను అతనే నరుక్కున్నట్లు అవుతుంది.అలాగే ఏ పని కరెక్ట్‌గా చేయలేరు. దాని వలన కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందంట.అలాగే ఇలాంటి వారి వలన తమ లైఫే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువంట. ఇలా తమ మనసు తమ నియంత్రణలో ఉంచుకోకపోవడం వలన తమ చేతులరా తన జీవితాన్ని తానే నాశం చేసుకుంటాని, అందువలన ఈ తప్పు అస్సలే చేయకూడదంటున్నాడు ఆచార్యచాణక్యుడు .

Advertisement

Next Story

Most Viewed